భక్తిశ్రద్ధలతో సామూహిక కుంకుమార్చన | - | Sakshi
Sakshi News home page

భక్తిశ్రద్ధలతో సామూహిక కుంకుమార్చన

Nov 24 2026 12:12 AM | Updated on Nov 24 2026 12:12 AM

● గణేష్‌ఘాట్‌ వద్ద

నేడు మహా కార్తీక దీపోత్సవం

నెల్లూరు(బృందావనం): సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో సోమవారం స్వర్ణాల చెరువు గణేష్‌ ఘాట్‌ వద్ద సామూహిక కుంకుమార్చనను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహా కార్తీక దీపోత్సవంలో భాగంగా ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి ఆలయం సమీపంలో మహాలక్ష్మి అమ్మవారికి ఈ పూజలు నిర్వహించారు. టీటీడీ ధర్మప్రచార పరిషత్‌ విశ్రాంత జిల్లా కో ఆర్డినేటర్‌ మల్లెల శ్రీహరి కుంకుమార్చన విశిష్టతను వివరించారు. ఈ సందర్భంగా సమితి అధ్యక్షురాలు డాక్టర్‌ కె.వెన్నెల మాట్లాడుతూ సనాతన భారతీయ సంస్కృతి, సంప్రదాయాల విశిష్టతను నేటి తరానికి తెలియజేసి, భావితరాలకు అందించాలనే సంకల్పంతో సామూహిక భాగస్వామ్యంతో సమాజ శ్రేయస్సు కోసం మహా కార్తీక దీపోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు. సమితి గౌరవ సలహాదారు గడ్డం సుజాత, ఉపాధ్యక్షురాలు కోడూరు జయప్రద, ప్రధాన కార్యదర్శి బయ్యా మల్లిక మాట్లాడారు. మంగళవారం నిర్వహించనున్న మహా కార్తీక దీపోత్సవానికి అవసరమైన దీప, పూజా సామగ్రిని అందజేస్తున్నట్లు తెలిపారు. కాశీ పండితులచే గంగాహారతి, శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి కల్యాణోత్సవం జరగనున్నాయన్నారు. విశాఖపట్నానికి చెందిన రమానంద భారతి స్వామి అనుగ్రహ భాషణతోపాటు సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. కార్యక్రమాలను కోడూరు జయరామయ్య, ముక్కాల వ్యాసప్రసాద్‌, చింతాల మల్లికార్జున, ఏవీఆర్‌ మోహన్‌రావు, పోలయ్య, సమితి నిర్వాహకులు పర్యవేక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement