వేర్వేరు ప్రమాదాలు.. తీరని విషాదాలు | - | Sakshi
Sakshi News home page

వేర్వేరు ప్రమాదాలు.. తీరని విషాదాలు

Nov 24 2026 12:12 AM | Updated on Nov 24 2026 12:12 AM

జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు జరిగాయి. తోటపల్లిగూడూరు మండలంలో ఒకరు మృతిచెందారు.

రెండు మండలాల్లో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.

లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు

చిల్లకూరు: లారీని అకస్మాత్తుగా డ్రైవర్‌ పక్కకు తిప్పే సమయంలో ఆపి వేయడంతో వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు కాగా ముగ్గురు తీవ్రంగా, పలువురు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటన మండలంలోని జాతీయ రహదారిపై సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు వైపు నుంచి చైన్నెకి లోడ్‌తో లారీ వెళ్తోంది. వరగలి క్రాస్‌రోడ్డు వద్దకు వచ్చే సరికి అకస్మాత్తుగా డ్రైవర్‌ కుడివైపునకు తిప్పాడు. అక్కడ బ్రిడ్జి నిర్మాణంలో ఉండటంతో వాహనాన్ని ఆపాడు. అదే మార్గంలో వెనుకగా నెల్లూరు నుంచి ప్రయాణికులతో చిత్తూరుకు వెళ్తున్న ఆ డిపో బస్సు లారీని ఢీకొంది. దీంతో బస్సు ముందు భాగం బాగా దెబ్బతింది. అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసేందుకు ప్రయత్నించారు. 108 అంబులెన్స్‌ సిబ్బంది క్షతగాత్రులను గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తీసుకెళ్లారు. తీవ్రంగా గాయపడిన వారిలో అనంతసాగరం మండలానికి చెందిన ఆమటి సుబ్బమ్మ, గంగాధరనెల్లూరు బుక్కపట్నానికి చెందిన లలితమ్మ, వెంకటగిరి కోట చినగానెపల్లికి చెందిన కామాక్షమ్మ ఉన్నారు. స్వల్పంగా గాయపడిన వారిలో తిరుపతికి చెందిన కావడి ధనమ్మ, ఏర్పేడు మండలం పరమపల్లెకు చెందిన పరమపల్లె అంజమ్మ, ఏర్పేడు చింతలపాళేనికి చెందిన పరమపల్లి మోహన్‌, నాయుడుపేటకు చెందిన జోగి శ్రావణ్‌ ఉన్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. కేసు నమోదు చేశారు.

ఇంటికెళ్తూ..

తోటపల్లి గూడూరు: మండలంలోని పోట్లపూడి గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన సోమవారం సాయంత్రం జరిగింది. ఎస్సై కామినేని గోపీ కథనం మేరకు.. పోట్లపూడి గ్రామానికి చెందిన బత్తిన మల్లికార్జునరెడ్డి (54) నెల్లూరు నుంచి ఇంటికి మోటార్‌బైక్‌పై బయలుదేరాడు. ఈ నేపథ్యంలో పోట్లపూడి సమీపంలో ఫోన్‌ మాట్లాడుతూ వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టి అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై కామినేని గోపీ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement