● జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో
రోడ్డు ప్రమాదాలు
● ముగ్గురి దుర్మరణం
బైక్ అదుపుతప్పి..
కోవూరు: మద్యం మత్తు, అతివేగం రెండు నిండు ప్రాణాలను బలితీసుకోగా, మరో యువకుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కోవూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారి – 16పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో తీరని విషాదా న్ని నింపింది. పోలీసులు, స్థానికుల కథనం మేర కు.. విడవలూరు మండలం రామలింగాపురం గ్రామానికి చెందిన మేకల వంశీ (19), వెంకటనారాయణపురం గ్రామానికి చెందిన కొండూరు సుబ్రహ్మణ్యం (19), చిన్ని దినేష్ (19) ముగ్గురూ మత్స్యకారులు. వీరు జువ్వలదిన్నె హార్బర్, బందరు ప్రాంతాల మధ్య లో ఉన్న సముద్రంలో చేపల వేట సాగిస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం రాత్రి జువ్వలదిన్నె హార్బర్ నుంచి నెల్లూరు రైల్వేస్టేషన్‌కు చేరుకు ని రైల్లో బందరు వెళ్లేందుకు ముగ్గురూ ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. దారిలో మద్యం తాగారు. శుక్రవారం తెల్లవారుజామున కోవూరు నుంచి నెల్లూ రు వెళ్లే జాతీయ రహదారిపై శ్రీవారి సుపథం లేఅవుట్ సమీపంలో బైక్ అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న ఇనుప దారిసూచిక బోర్డును బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో వంశీ, సుబ్రహ్మణ్యం అక్కడికక్కడే మృతి చెందారు. దినేష్ స్వల్ప గాయాలతో బయటపడ్డా డు. సమాచారం అందుకున్న కోవూరు పోలీసులు ఘ టనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదే హాలను కోవూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
గ్రామాల్లో విషాదం
19 ఏళ్ల వయసులోనే ఇద్దరు యువకులు మృత్యువాత పడటంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. కుటుంబాలకు అండగా నిలవాల్సిన కుమారులు విగతజీవులుగా మారడంతో రామలింగాపురం, వెంకటనారాయణపురం గ్రామాల్లో విషాదం నెలకొంది.
ఆర్టీసీ బస్సు కిందపడి..
పొదలకూరు: రోడ్డుపై పడిన ఉల్లిపాయల కారణంగా ఓ వ్యక్తి ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడ్డాడు. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సు కిందపడి మృతిచెందాడు. ఈ ఘటన మండలంలోని బిరదవోలు పంచాయతీ బ్రాహ్మణపల్లి వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. అదే పంచాయతీ పరిధిలోని చెర్లోపల్లి గ్రామానికి చెందిన నాగేళ్ల ప్రభాకర్‌నాయుడు (65) స్కూటీపై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఉల్లిపాయల బస్తాలు జారిపడటంతో అవి రోడ్డంతా చెల్లాచెదురుగా పడ్డాయి. వాహనాల రాకపోకలతో అవి నలిగిపోవడంతో రహదారి జారుడుగా మారింది. ప్రభాకర్ నాయుడుకు ముందు వెళ్తున్న ఇద్దరు, ముగ్గురు ద్విచక్ర వాహనదారులు కూడా అక్కడ జారిపడినట్లు సమాచారం. అదే మార్గంలో ఉల్లిపాయలు పడిన ప్రాంతానికి స్కూటీపై వెళ్తున్న ప్రభాకర్ చేరుకోగానే వాహనం అదుపుతప్పి కిందపడ్డాడు. ఈ సమయంలో వెనుకనే వస్తున్న గూడూరు ఆర్టీసీ బస్సు అతడిపై నుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందారు. ప్రభాకర్‌కు భార్య, ముగ్గురు పిల్లలున్నారు. అందరితో కలుపుగోలుగా ఉండే వ్యక్తి మృతితో చెర్లోపల్లిలో విషాదం అలుముకుంది. సమాచారం అందుకున్న పొదలకూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.


