జెడ్పీ చైర్మన్‌గా పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి | - | Sakshi
Sakshi News home page

జెడ్పీ చైర్మన్‌గా పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి

Nov 21 2026 12:14 AM | Updated on Nov 21 2026 12:14 AM

● వైస్‌ చైర్మన్‌గా పొట్టేళ్ల ప్రసాద్‌ ఏకగ్రీవ ఎన్నిక

నెల్లూరు (పొగతోట): జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా ఇందుకూరుపేట జెడ్పీటీసీ సభ్యుడు పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, వైస్‌ చైర్మన్‌గా మనుబోలు జెడ్పీటీసీ సభ్యుడు పొట్టేళ్ల ప్రసాద్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం నెల్లూరులోని జెడ్పీ సమావేశ మందిరంలో కలెక్టర్‌ హిమాన్షు శుక్లా, ప్రత్యేక అధికారి సదా భార్గవి ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా, వైఎస్సార్‌సీపీకి చెందిన వింజమూరు, సైదాపురం జెడ్పీటీసీ సభ్యులు పి.కొండారెడ్డి, వెందోటి సునీత సకాలంలో హాజరయ్యారు. మిగిలిన జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు మధ్యాహ్నం 1:20 గంటల తర్వాత సమావేశానికి వచ్చారు. మధ్యాహ్నం 1:55 గంటల అనంతరం కలెక్టర్‌ జెడ్పీటీసీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. 2:15 గంటలకు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికల ప్రక్రియను నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, పాశం సునీల్‌కుమార్‌, కావ్య కృష్ణారెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి, జెడ్పీ సీఈఓ మధుసూదన్‌, డిప్యూటీ సీఈవో బ్రహ్మయ్య, డీఎల్‌డీఓ స్వరూప్‌, గ్రామ, వార్డు సచివాలయాల అధికారి వసుమతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement