● ఎన్నికలను అపహాస్యం చేస్తున్న
చంద్రబాబు
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
వెంకటగిరి(సైదాపురం): ‘కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు అధ్వానంగా మారాయి. చంద్రబాబు స్థానిక ఎన్నికలను అపహాస్యం చేస్తున్నారు’ అని వైఎస్సార్‌సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. వెంకటగిరిలో ఎంపీపీ ఎన్నిక సందర్భంగా శుక్రవారం నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న కాకాణి నేదురుమల్లి నివాసానికి చేరుకున్నారు. తిరుపతి ఎంపీ గురుమూర్తితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వెంకటగిరి నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలు ప్రలోభాలకు లొంగకుండా పార్టీ వెంట నిలిచారన్నారు. పరిషత్ ఎన్నికల సందర్భంగా నామినేషన్ల దశ నుంచి కౌంటింగ్ వరకు అధికార పార్టీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు. రామ్‌కుమార్‌రెడ్డి పోరాడినందుకు నియోజకవర్గంలో రెండు ఎంపీపీ స్థానాల్లో సమాన ఫలితాలు వచ్చాయని గుర్తుచేశారు. రెండురోజులపాటు జరిగిన వెంకటగిరి ఎంపీపీ ఎన్నికలో గందరగోళం స్పష్టించేందుకు కూటమి నేతలు తెరలేపినా రామ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంతో గురుమూర్తి ప్రత్యేకంగా హాజరై ఎంపీటీసీలకు అండగా ఉండటం హర్షణీయమన్నారు. లక్కీడ్రా వేసే సమయంలో అధికార పార్టీ నేతలకే అన్ని స్థానాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. స్లిప్‌లు తయారు చేయడం, వాటిని మడవడం, ఎత్తడం వంటి ప్రక్రియలో పారదర్శకత పాటించలేదని ఆరోపించారు. నియోజకవర్గ ప్రజలు వైఎస్సార్‌సీపీ వైపు ఉన్నారన్నారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని ఈదఫా బంగాళాఖాతంలో కలిపేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
ఎంపీటీసీలకు అభినందన
నీతిగా వ్యవహరించిన నలుగురు ఎంపీటీసీలను కాకాణి అభినందించారు. రామ్‌కుమార్‌రెడ్డితోపాటు నలుగురు ఎంపీటీసీలను అధినేత జగనన్న దగ్గరకు తీసుకెళ్లి వారి సాహసాన్ని వివరిస్తామని చెప్పారు.


