టిప్పర్లను అడ్డుకుని గిరిజనుల నిరసన | - | Sakshi
Sakshi News home page

టిప్పర్లను అడ్డుకుని గిరిజనుల నిరసన

Nov 21 2026 12:14 AM | Updated on Nov 21 2026 12:14 AM

● దుమ్ముతో తిండి కూడా

తినలేకపోతున్నామని ఆవేదన

చిల్లకూరు: గూడూరు రూరల్‌ పరిధిలోని నెర్నూరు గ్రామ గిరిజన కాలనీ వాసులు శుక్రవారం టిప్పర్లను అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుందకూరు సమీపంలోని క్వారీలకు నెర్నూరు గిరిజన కాలనీల మీదుగా టిప్పర్లు రాకపోకలు సాగిస్తున్నాయన్నారు. ఒక్కో టిప్పర్‌లో సుమారు 50 టన్నుల మేర లోడుతో రాకపోకలు సాగిస్తుండటంతో రహదారులు పూర్తిగా ధ్వంసమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. వాహనాల రాకపోకలతో విపరీతంగా దుమ్ము లేస్తోందని, అది ఇళ్లలోకి చేరుతుండటంతో కనీసం తిండి కూడా తినలేకపోతున్నామని వాపోయారు. మూడు నెలల క్రితం ఆర్‌అండ్‌బీ అధికారులు ఈ ప్రాంతంలో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టినప్పటికీ, టిప్పర్ల రాకపోకలతో ప్రస్తుతం రహదారి గుంతలమయంగా మారిందన్నారు. పలుమార్లు క్వారీ యజమానులకు సమస్యను వివరించినా, రహదారిపై నీరు చల్లించే చర్యలు కూడా చేపట్టడం లేదని తెలిపారు. దుమ్మును పీల్చడంతో ఇటీవల పలువురు శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారన్నారు. అధికారులు స్పందించి భారీ వాహనాల రాకపోకలపై నియంత్రణ విధించాలని కోరారు. టిప్పర్లలో అనుమతించిన పరిమితికి మించి లోడు వేయకుండా చర్యలు తీసుకోవాలని, రహదారులను పరిరక్షించడంతో పాటు రెండు గిరిజన కాలనీల ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement