రోబోటిక్‌ టెక్నాలజీతో భారతి సిమెంట్‌ తయారీ | - | Sakshi
Sakshi News home page

రోబోటిక్‌ టెక్నాలజీతో భారతి సిమెంట్‌ తయారీ

Nov 21 2026 12:14 AM | Updated on Nov 21 2026 12:14 AM

కావలి: భారతి సిమెంట్‌ను రోబోటిక్‌ సాంకేతికతతో తయారు చేస్తున్నట్లుగా ఆ సంస్థ జిల్లా ప్రతినిధులు, మార్కెటింగ్‌ అధికారి బాబ్‌జాన్‌, టెక్నికల్‌ ఇంజనీర్‌ శ్రీనివాసులు తెలిపారు. కావలిలో శుక్రవారం విజయలక్ష్మి స్టీల్స్‌ అండ్‌ సిమెంట్‌ ఆధ్వర్యంలో మేస్త్రిలకు సిమెంట్‌ వినియోగంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో తయారుచేసిన భారతి సిమెంట్‌ భవన నిర్మాణాలకు పటిష్టతనిస్తుందని తెలిపారు. అల్ట్రా ఫాస్ట్‌ నాణ్యతా ప్రమాణాలతో కూడిన ఈ సిమెంట్‌ తక్కువ సమయంలో నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు దోహదపడుతుందన్నారు. ఇతర కంపెనీల సిమెంట్‌ ఐదు గంటల్లో సెట్‌ అయితే, భారతి అల్ట్రాఫాస్ట్‌ సిమెంట్‌ రెండు గంటల్లోనే సెట్‌ అవుతుందని వివరించారు. దీంతో నిర్మాణ పనులు త్వరగా పూర్తవడంతోపాటు కట్టడాలకు మంచి దృఢత్వం లభిస్తుందని తెలిపారు. అనంతరం మేస్త్రికు రూ.లక్ష విలువైన ఉచిత బీమా బాండ్లు, బీమా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో డీలర్‌ మహేష్‌రెడ్డి పాల్గొన్నారు.

నేటి నుంచి రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్‌ పోటీలు

నెల్లూరు(టౌన్‌): నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం ఇండోర్‌ స్టేడియం రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్‌ పోటీలకు సిద్ధమైంది. విద్యాశాఖ, పాఠశాల క్రీడా సమాఖ్య నెల్లూరు జిల్లా ఆధ్వర్యంలో శనివారం నుంచి 23వ తేదీ వరకు 70వ రాష్ట్ర స్థాయి అండర్‌ – 17 బాలబాలికల బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 130 మంది క్రీడాకారులు ఈ పాల్గొననున్నారు. వీరితోపాటు 52 మంది కోచ్‌లు, మేనేజర్లు హాజరుకానున్నారు.

సంజీవినితో

మెరుగైన వైద్య సేవలు

● డీఎంహెచ్‌ఓ సుజాత

నెల్లూరు(అర్బన్‌): త్వరలో జిల్లాలోని అన్ని పట్టణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీలు) పరిధిలో ప్రారంభించనున్న సంజీవిని కార్యక్రమం ద్వారా పేదలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించనున్నట్లు డీఎంహెచ్‌ఓ సుజాత తెలిపారు. శుక్రవారం నెల్లూరులోని మద్రాస్‌ బస్టాండ్‌ సమీపంలో వైద్యులు, వైద్య సిబ్బందికి సంజీవిని కార్యక్రమంపై శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ సంజీవిని మిత్రలకు అవసరమైన జ్ఞానం, నైపుణ్యాలు, సామర్థ్యాలను పెంపొందించి, ప్రాజెక్టును సమర్థవంతంగా అమలు చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీపీఎం డాక్టర్‌ సునీల్‌, ఎన్‌సీడీ ప్రాజెక్ట్‌ అధికారి డాక్టర్‌ అన్షుధర్‌, వైద్యులు పవన్‌, హర్షిత, భవ్య, రమేష్‌, డీపీఎంయూ సిబ్బంది పాల్గొన్నారు.

రేపట్నుంచి

తరగతుల ప్రారంభం

నెల్లూరు(టౌన్‌): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో 2026 – 27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఈనెల 22వ తేదీన నుంచి తరగతులు ప్రారంభం కానున్నట్లుగా రీజినల్‌ సెంటర్‌ కో ఆర్డినేటర్‌ ఎం.పిచ్చయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ, బీఎల్‌ఐఎస్‌సీ కోర్సుల్లో ప్రవేశం పొందిన విద్యార్థులు తరగతులకు తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement