రోగిని కాపాడేందుకు చిత్తశుద్ధితో పనిచేయాలి | - | Sakshi
Sakshi News home page

రోగిని కాపాడేందుకు చిత్తశుద్ధితో పనిచేయాలి

Nov 19 2026 12:43 AM | Updated on Nov 19 2026 12:43 AM

● మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ రాజేశ్వరి

నెల్లూరు(అర్బన్‌): రోగుల ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు, వైద్య సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేయాలని ప్రభుత్వ మెడికల్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ రాజేశ్వరి సూచించారు. నెల్లూరులోని కళాశాల సమావేశ మందిరంలో వైద్యులు, వైద్య సిబ్బందికి మెడికో లీగల్‌ అంశాలపై రెండు రోజులుగా నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమం బుధవారంతో ముగిసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రమాదాలు, ఘర్షణల్లో గాయపడిన వారికి వైద్యం అందిస్తూనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. రోగి మృతిచెందిన సందర్భాల్లో ఫోరెన్సిక్‌ వైద్యుల పాత్రను వివరించారు. మెడికో లీగల్‌ కేసుల నిర్వహణ, సాక్ష్యాధారాల సేకరణ, పోస్టుమార్టం విధానాలు, వైద్యుల చట్టపరమైన బాధ్యతలపై శిక్షణలో అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పెద్దాస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కొండేటి మాధవి, ఫోరెన్సిక్‌ విభాగాధిపతి డాక్టర్‌ లక్ష్మీనారాయణ, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సురేష్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు పవన్‌, ధర్మతేజ, సీనియర్‌ రెసిడెంట్‌, పీజీ వైద్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement