రైల్వేస్టేషన్లలో జీఎం తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

రైల్వేస్టేషన్లలో జీఎం తనిఖీలు

Nov 19 2026 12:43 AM | Updated on Nov 19 2026 12:43 AM

నెల్లూరు(వీఆర్సీసెంటర్‌): గూడూరు, నెల్లూరు, శ్రీవెంకటేశ్వరపాళెం రైల్వే సెక్షన్లలో చేపడుతున్న కవచ్‌ పనులతోపాటు నెల్లూరు రైల్వేస్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను దక్షిణ కోస్తా రైల్వే జనరల్‌ మేనేజర్‌ నందీష్‌ మధుర్‌ బుధవారం పరిశీలించారు. అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకం కింద చేపడుతున్న పనుల గురించి ఆరాతీశారు. స్టేషన్‌ భవనం, ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలు, ప్రయాణికుల నిరీక్షణ మందిరం, రైల్వే కార్యాలయాలను పరిశీలించారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతోపాటు రాకపోకలకు అనువుగా స్టేషన్‌ను అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో విజయవాడ డివిజన్‌ డీఆర్‌ఎం మోహిత్‌ సోంకియా, చీఫ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ అంకుష్‌ గుప్తా, ప్రిన్సిపల్‌ చీఫ్‌ ఆపరేషన్స్‌ మేనేజర్‌ వినీత్‌ కుమార్‌, ప్రిన్సిపల్‌ చీఫ్‌ సిగ్నల్‌ అండ్‌ టెలి కమ్యూనికేషన్‌ ఇంజినీర్‌ సురేష్‌ కుమార్‌, ప్రిన్సిపల్‌ చీఫ్‌ ఎలక్ట్రికల్‌ ఇంజినీర్‌ టీకే సిన్హా తదితర రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement