దత్తతతో చిన్నారికి కొత్త జీవితం | - | Sakshi
Sakshi News home page

దత్తతతో చిన్నారికి కొత్త జీవితం

Nov 19 2026 12:43 AM | Updated on Nov 19 2026 12:43 AM

నెల్లూరు(అర్బన్‌): ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో నెల్లూరులో నిర్వహిస్తున్న శిశుగృహంలో పెరుగుతున్న ఓ అనాథ చిన్నారిని కలెక్టర్‌ హిమాన్షు శుక్లా బుధవారం ఒడిశాకు చెందిన దంపతులకు చట్టబద్ధంగా దత్తత ఇచ్చారు. కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో ఐసీడీఎస్‌ అధికారుల సమక్షంలో చిన్నారిని దంపతులకు అప్పగించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ దత్తత తీసుకున్న చిన్నారికి ప్రేమాభిమానాలు పంచుతూ, నాణ్యమైన విద్యను అందించి ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేయాలని దంపతులను కోరారు. చిన్నారుల సంరక్షణ, పునరావాసంలో దత్తత ప్రక్రియ ఎంతో కీలకమని పేర్కొన్నారు. చిన్నారిని దత్తత తీసుకున్న దంపతులు కలెక్టర్‌, ఐసీడీఎస్‌ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ పీడీ నాగశైలజ, జిల్లా బాలల సంరక్షణ అధికారి సురేష్‌, శిశుగృహ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడిపై దాడికి యత్నం

చేజర్ల: మండలంలోని చిత్తలూరు గ్రామంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడిపై టీడీపీ కార్యకర్తలు బుధవారం సాయంత్రం దాడికి ప్రయత్నించారు. గ్రామంలో నేత సామాజిక వర్గానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల టీడీపీని వీడి వైస్సార్‌సీపీకి మద్దతు పలికాడు. ఈ నేపథ్యంలో తెలుగు తమ్ముళ్లు అతని ఇంటిపై దాడి చేయబోగా వైఎస్సార్‌సీపీ నాయకులు అడ్డుకున్నారు. అక్రమ కేసులు బనాయించి, నామినేషన్ల ఘట్టంలో పైచేయి సాధించాలని టీడీపీ నాయకులు కుట్ర పన్నుతున్నట్లు వైఎస్సార్‌సీపీ నాయకులు ఆరోపించారు. సమాచారం అందుకున్న చేజర్ల ఎస్సై అయ్యప్ప గ్రామాన్ని సందర్శించి ఎన్నికలవేళ గ్రామాల్లో 144 సెక్షన్‌ అమల్లో ఉందని, ఘర్షణలకు తావు లేదని ఇరువర్గాలను హెచ్చరించారు.

గుర్తుతెలియని

వాహనం ఢీకొని..

● రెండు గేదెల మృతి

సీతారామపురం: స్థానిక ఆదర్శ పాఠశాల సమీపంలోని 167 బీజీ జాతీయ రహదారిపై బుధవారం వేకువజామున గుర్తుతెలియని వాహనం ఢీకొని రెండు గేదెలు మృతిచెందాయి. ప్రమాదానికి కారణమైన వాహనం ఆపకుండా వెళ్లిపోయినట్లు స్థానికులు తెలిపారు. సుమారు రూ.60 వేల విలువైన గేదెలు మృతిచెందడంతో వాటి యజమాని తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. జాతీయ రహదారిపై పశువుల సంచారాన్ని నియంత్రించడంతోపాటు వాహనాల వేగాన్ని అదుపు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement