● కెమెరాల్లేకుండానే పరిశీలన.. విత్‌డ్రా
● పరిషత్ పోరులో టీడీపీ కుట్ర
● ఇదే తరహాలో సర్పంచ్ ఎన్నికల్లోనూ మోసాలకు ప్లాన్
నెల్లూరు(పొగతోట): గ్రామ పంచాయతీ, వార్డుల నామినేషన్ల పరిశీలన, విత్ డ్రాల్లో కుట్రలకు అధికార పార్టీ రూపకల్పన చేసింది. టీడీపీ అభ్యర్థులు ఓటమి చెందే పంచాయతీలు, వార్డుల్లో ప్రత్యర్థి నామినేషన్లను తిరస్కరించేలా కుట్రలకు సిద్ధమయ్యారు. పరిషత్ పోరు సమయంలోనూ ఇలానే చేశారు. అప్పుడు నామినేషన్ల స్వీకరణ వరకు కెమెరాలను ఏర్పాటు చేయగా.. పరిశీలన, విత్‌డ్రా సమయానికి వీటిని మాయం చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలంటూ అధికారులు మాటదాటేశారు.
సరికొత్త డ్రామాలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించే చోట నామినేషన్లను తిరస్కరించారు. ఉపసంహరణ సమయంలో వీటిని విత్‌డ్రా చేసుకున్నారంటూ డ్రామాలాడారు. తాజాగా పల్లెపోరులోనూ ఇదే తరహాలో అక్రమాలకు అధికార పార్టీ కుట్రలు చేస్తోంది. నామినేషన్ల స్వీకరణ కేంద్రాల్లో సీసీ కెమెరాలను ప్రస్తుతం ఏర్పాటు చేశారు. అయితే పరిశీలన, విత్ డ్రాల సమయానికి వీటిని అదృశ్యం చేసేందుకు స్కెచ్చేశారు. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో వీటిని నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశారు.
ప్రపోజర్ విత్‌డ్రా చేయొచ్చు
సర్పంచ్ అభ్యర్థి నామినేషన్‌కు ప్రపోజర్ సంతకం చేయల్సి ఉంది. అయితే అభ్యర్థి రాకపోయినా, వీటిని విత్ డ్రా చేసే అవకాశాన్ని ప్రపోజర్‌కు కల్పించారు. ఎన్నికల నిబంధనల మేరకు ఈ పద్ధతి ఉండటంతో దీన్ని ఆసరాగా చేసుకొని కొత్త నాటకాలకు అధికార పార్టీ తెరలేపనుందని తెలుస్తోంది. సర్పంచ్ అభ్యర్థి మాట వినకపోతే ప్రపోజర్‌ను భయభ్రాంతులకు గురిచేసేలా కుట్రలు పన్నుతున్నారని సమాచారం. ఈ క్రమంలో అభ్యర్థులు తమకు అత్యంత నమ్మకమైన వారిని ప్రపోజర్లుగా ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
రెండు నామినేషన్లేసే సమయంలో జాగ్రత్త
సర్పంచ్‌లు, వార్డు సభ్యులుగా పోటీ చేసే వారు ముందుజాగ్రత్తగా రెండు, మూడు నామినేషన్లు వేస్తారు. పరిశీలన ప్రక్రియ నాటికి ఒక దాన్ని ఉంచి మిగిలిన వాటిని ఉపసంహరిస్తున్నారు. ఇక్కడే కొందరు అధికారులు అభ్యర్థులను బురిడీ కొట్టిస్తున్నారు. ఉదాహరణకు బాపట్ల జెడ్పీటీసీ అభ్యర్థి రెండు నామినేషన్లు వేశారు. పరిశీలనలో అధికారులు వీటికి ఓకే చేశారు. విత్ డ్రా సమయంలో ఒక దాన్ని ఉపసంహరించుకోగా, అభ్యర్థికి నగదును తిరిగిచ్చారు. చివరికి రెండు నామినేషన్లను విత్ డ్రా చేసుకున్నారని సంతకాలు చేశారని అధికారులు నిర్ధారించారు. చివరికి పోటీలో ఉన్న అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ప్రకటించారు. ఇలాంటి పొరపాట్లు జరగకుండా రెండు, మూడు నామినేషన్లు వేసే వారు ఒకటికి రెండుసార్లు పరిశీలించి నగదు తీసుకోవడం, సంతకాలు చేస్తే నష్టపోకుండా ఉంటారు.
రెండో దశ నామినేషన్ల స్వీకరణ
నెల్లూరు(పొగతోట): పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన రెండో దశ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ బుధవారం ప్రారంభమమైంది. 14 మండలాల్లోని 297 పంచాయతీలు.. 2714 వార్డులకు వీటిని స్వీకరించారు. దీనికి గానూ 87 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రక్రియ శుక్రవారం వరకు జరగనుంది.
మండలం సర్పంచ్ వార్డులు
అనంతసాగరం 7 3
ఏఎస్‌పేట 5 35
ఆత్మకూరు 5 4
చేజర్ల 2 3
కలువాయి 11 36
మర్రిపాడు 5 11
సంగం 1 5
సీతారామపురం 8 6
ఉదయగిరి 1 11
చిల్లకూరు 10 56
గూడూరు 1 0
కోట 0 0
దుత్తలూరు 16 29
వరికుంటపాడు 17 11
మొత్తం 89 210
నామినేషన్ కేంద్రం వద్ద గుంపులుగా టీడీపీ నేతలు (ఫైల్)
చిల్లకూరు: నామినేషన్ల పర్వం ముగిసిన అనంతరం మంగళవారం నిర్వహించిన పరిశీలనలో అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించారు. వాస్తవానికి నామినేషన్‌ను తిరస్కరిస్తే, దీనికి గల కారణాలపై అభ్యర్థికి ఆర్వో లిఖితపూర్వకంగా తెలియజేయాల్సి ఉంది. అయితే నోటీస్ బోర్డులో పెడతాం.. చూసుకోండంటూ సలహా ఇచ్చారు. తిరస్కరణల జాబితాను అర్ధరాత్రి అందించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై న్యాయపోరాటానికి తాము సిద్ధమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పేర్కొంటున్నారు.
ఎన్నికలు అపహాస్యం
గూడూరు మున్సిపాల్టికి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైన నాటి నుంచి అధికార పార్టీ నేతలు అడ్డగోలుగా వ్యవహరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు దాఖలు చేయకుండా, పత్రాలను లాక్కొని చించేశారు. కొందర్ని ఏకంగా స్టేషన్‌కు తరలించి నామినేషన్ల సమయం పూర్తయ్యాక విడిచిపెట్టారు. ఇలా అధికారులు, పోలీసుల సాయంతో మున్సిపల్ ఎన్నికలను టీడీపీ నేతలు అపహాస్యం చేశారు.
తప్పుల్లేకపోయినా.. రిజెక్ట్
అడ్డంకులను ఎదుర్కొని నామినేషన్లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు దాఖలు చేశారు. అయితే ఇందులో తప్పుల్లేకపోయినా, పట్టుబట్టి తిరస్కరణకు గురిచేశారు. స్థానిక ప్రజాప్రతినిధి నివసించే వార్డులో అధికార పార్టీ అభ్యర్థిని ఏకగ్రీవం చేసేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన మహిళ.. పోలీసుల నుంచి ఎన్వోసీని తీసుకొచ్చి నామినేషన్ వేశారు. అయితే అధికారులు ధ్రువీకరించే సమయంలో టీడీపీ నేతలు అక్కడికి చేరుకున్నారు. అభ్యర్థిపై ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్లో ఎఫ్‌ఐఆర్ నమోదైందటూ నామినేషన్‌ను తిరస్కరించేలా కుట్రలు పన్నారు. ఈ పచ్చపాతానికి అధికారులు సైతం సహకరించారు. గూడూరు మున్సిపాల్టీలోని 48 వార్డులకు గానూ 250 నామినేషన్లు దాఖలు కాగా, అందులో ఏకంగా 52ను తిరస్కరించారు. వీటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారివే అధికంగా ఉన్నాయి.


