పోలీసులా.. పచ్చ గూండాలా! | - | Sakshi
Sakshi News home page

పోలీసులా.. పచ్చ గూండాలా!

Nov 19 2026 12:43 AM | Updated on Nov 19 2026 12:43 AM

కావలి: కావలి నియోజకవర్గంలో పోలీసులు పచ్చ పార్టీ గూండాల్లా వ్యవహరిస్తూ వైఎస్సార్‌సీపీ వర్గీయులను వేధిస్తున్నారని, టీడీపీ రౌడీమూకలు మాపైనే దాడులు, దౌర్జనాలు చేస్తే తిరిగి మాపైనే కేసులు పెడుతున్నారని, నిన్న నా మీదే అటెంప్ట్‌ ఆయుధాలతో దాడి చేశామని మర్డర్‌ కేసు పెట్టారని కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. కోవూరుపల్లి పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేస్తున్న మన్నేపల్లి శ్రీనివాసులు భార్య బొచ్చు దుర్గమ్మ నామినేషన్‌ విత్‌ డ్రా చేసుకోవాలంటూ కావలి రూరల్‌ సీఐ శివశంకర్‌ శ్రీనివాసులను బెదిరించారు. గంజాయి కేసులతోపాటు రౌడీషీట్‌ ఓపెన్‌ చేస్తామని వేధించడంతో అతను పురుగుమందు తాగడంతో ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నాడని, అతనికి ఏదైనా జరిగితే.. పోలీసులే దీనికి బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. బుధవారం రాత్రి కావలి ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాసులను పరామర్శించి, మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. అనంతరం ప్రతాప్‌కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాబోయేది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వమేనని, టీడీపీకి కొమ్ముకాసే ఏ పోలీసును వదిలిపెట్టమని, ఖాకీ చొక్కాలిప్పించి చట్టం ముందు నిలబెడుతామని హెచ్చరించారు. ఈ నియోజకవర్గంలో టీడీపీలో మొలతాడు కట్టిన మగాడే లేడని, పోటీ చేసి గెలిచే దమ్ములేక శిఖండి రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. కావలి అంటే ఎంతో ప్రశాంతమైన నియోజకవర్గమని, కలికి యానాదిరెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, వంటేరు వేణుగోపాల్‌రెడ్డి, మాగుంట పార్వతమ్మ, బీద మస్తాన్‌రావుతోపాటు తాను కూడా ఎమ్మెల్యేగా పని చేశామని, ఇలాంటి రౌడీయిజం, గూండాయిజం రాజకీయాలు చేయలేదని చెప్పారు. ఎమ్మెల్యే కృష్ణారెడ్డి నీతులు చెబుతున్నాడని, ఆయన ఎమ్మెల్యే అయ్యాకే ఇలాంటి అరాచకాలు జరుగుతున్నాయని, కావలికి దరిద్రం పట్టిందన్నారు. మున్సిపాలిటీ ఆఫీసులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నామినేషన్‌ను రిజెక్ట్‌ చేయాలని టీడీపీ నాయకులు ఏ విధంగా దౌర్జన్యం చేశారో, పోలీసులను ఉపయోగించి మమ్మల్ని అందరిని బయటకుకి పంపించారో కావలి పట్టణ ప్రజలందరూ చూశారన్నారు. ఒక ఎమ్మెల్యేగా ఉండి సిగ్గు లేకుండా ప్రెస్‌మీట్‌ పెట్టి వైఎస్సార్‌సీపీ వాళ్లు పోలీసులపై దౌర్జన్యం చేశారని చెప్పారన్నారు.

కోవూరుపల్లి ఘటన దురదృష్టకరం

కోవూరుపల్లి ఘటన దురదృష్టకరమన్నారు. సీఐ, ఎస్సై తమ పార్టీ సర్పంచ్‌ అభ్యర్థి భర్త శ్రీనివాసులును బెదిరించడంతో వల్లే ఇలా జరిగిందన్నారు. పోలీసులే గూండాలాగా మారారన్నారు. శ్రీనివాసులు మీద ఇప్పటికే అనేక తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. అతని ప్రాణానికి ఏదైనా అయిందంటే ఆ పోలీసులను తప్పకుండా కోర్టుకు ఈడుస్తాం. తగిన శిక్ష పడేదాకా ఒప్పుకోమన్నారు. మంగళవారం మున్సిపల్‌ ఆఫీస్‌లో లేని వ్యక్తి మీద కేసు పెట్టారు. చైతన్య అమ్మ నామినేషన్‌ వేసింది. అతను సపోర్టర్‌ సిగ్నేచర్‌కు వచ్చాడు. అతనిపై రౌడీ షీట్‌ ఓపెన్‌ చేస్తామంటున్నారు. మొన్న జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్‌ చూశాం. మామూలుగా బూత్‌లో రిగ్గింగ్‌ చేస్తారు కానీ, ఆ రోజు కౌంటింగ్‌లో కూడా రిగ్గింగ్‌ చేశారు. అధికారులు సహకరిస్తున్నారు, పోలీసులు సహకరిస్తా ఉన్నారు. ఇప్పటికై నా అధికారులకు చెబుతున్నాం. మీ ఉద్యోగాలు మీరు బాధ్యతగా చేయండి. ఎమ్మెల్యే చేసిన అరాచకాలకు దగదర్తి మండలంలో టీడీపీ నాయకుడు కుటుంబంలో ఇద్దరు చనిపోయారు. కావలిలో ఇటువంటి సంస్కృతి ఇప్పటి వరకు లేదన్నారు.

ఖాకీ చొక్కాలిప్పించి చట్టం ముందు నిలబెడతాం

టీడీపీకి కొమ్ముకాసే ఏ పోలీస్‌ను

వదిలి పెట్టం

శాంతిభద్రతలను కాపాడాల్సిన వారే అరాచకాలకు తెరలేపుతారా?

గెలిచే దమ్ములేక తెలుగుదేశం వాళ్లు.. శిఖండి రాజకీయాలు చేస్తున్నారు

కోవూరుపల్లి సర్పంచ్‌ అభ్యర్థి భర్తకు ఏదైనా జరిగితే తీవ్ర పరిణామాలు

ఉంటాయి

కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి

ప్రతాప్‌కుమార్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement