కాకాణితో మేకపాటి భేటీ | - | Sakshi
Sakshi News home page

కాకాణితో మేకపాటి భేటీ

Nov 19 2026 12:43 AM | Updated on Nov 19 2026 12:43 AM

ఉదయగిరి: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మాజీ మంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డిని నెల్లూరులోని ఆయన నివాసంలో పార్టీ ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్‌రెడ్డి బుధవారం కలిశారు. నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితులు, సర్పంచ్‌ల ఎన్నికలు తదితరాలపై చర్చించారు. పార్టీ మద్దతుతో బరిలో నిలిచే అభ్యర్థులకు గెలిపించాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.

వైఎస్సార్సీపీ చైర్మన్‌

అభ్యర్థిగా లక్ష్మయ్య

అల్లూరు: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అల్లూరు నగర పంచాయతీ చైర్మన్‌ అభ్యర్థిగా కుమ్మరగుంట లక్ష్మయ్యకు బీ – ఫారాన్ని అందజేశారు. అల్లూరులోని పార్టీ సీఈసీ సభ్యుడు కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి నివాసానికి మాజీ ఎమ్మెల్యే, కావలి నియోజకవర్గ ఇన్‌చార్జి రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి బుధవారం విచ్చేశారు. ఈ క్రమంలో ఆయనకు బీ – ఫారాన్ని అందజేశారు. 23 వార్డులకు గానూ నార్తుమోపూర్‌లో నాలుగింటికి ఎన్నికలను బహిష్కరించారు. కూటమికి ఒకటి ఏకగ్రీవం కావడంతో, మిగిలిన 18 వార్డులకు ఎన్నికలను నిర్వహించనున్నారు. దీంతో వీరికి బీ – ఫారాలను అందజేశారు. పార్టీ శ్రే ణులు సమన్వయంతో పనిచేసి చైర్మన్‌ అభ్యర్థికి భారీ మెజార్టీని తీసుకొచ్చి, కౌన్సిలర్‌ స్థానాల్లో గెలుపొందేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. నేతలు నీలం సాయికుమార్‌, బాలకృష్ణంరాజు, ఉస్మాన్‌, కరుణాకర్‌, శేఖర్‌రెడ్డి, మాధవ్‌, రాజీ, జంషీర్‌ తదితరులు పాల్గొన్నారు.

పోటీకి ఎఫ్‌ఏల ఉత్సాహం

● ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్న వైనం

నెల్లూరు(పొగతోట): వీబీ – జీ – రామ్‌జీలో విధులు నిర్వర్తిస్తున్న ఫీల్డ్‌ అసిస్టెంట్లు రాజీనామాలు చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌లుగా, వార్డు సభ్యులుగా పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. వాస్తవానికి పంచాయతీలోని అందరితో వీరికి పరిచయాలున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు సుమారు పది మంది ఇలా రాజీనామాలు చేశారని సమాచారం. ఏళ్లుగా పనిచేస్తున్న ఎఫ్‌ఏలను 2024లో టీడీపీ కొలువుదీరాక తొలగించారు. ఆ తర్వాత గ్రామాల్లో అధికార పార్టీకి చెందిన చోటా నేతలను ఈ స్థానాల్లో నియమించారు. ఈ క్రమంలో బరిలో నిలిచేందుకు వీరు రాజీనామాలు చేస్తున్నారు.

స్క్రూట్నీ పూర్తి

నెల్లూరు(పొగతోట): గ్రామ పంచాయతీలకు సంబంధంచిన మొదటి విడత నామినేషన్ల పరిశీలన ప్రక్రియను బుధవారం రాత్రి పూర్తి చేశారు. 134 సర్పంచ్‌ స్థానాలకు 831 మంది నామినేషన్లు వేయగా, 702ను ఓకే చేశారు. 1332 వార్డులకు గానూ 3547 మంది దాఖలు చేయగా, 3445కు ఆమోదముద్రేశారు.

మూడో దశకు నేడు..

నెల్లూరు(పొగతోట): మూడో దశ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను గురువారం విడుదల చేయనున్నారు. 13 మండలాల్లోని 270 పంచాయతీలు, 1908 వార్డులకు నామినేషన్లను ఈ నల 21 నుంచి 23 వరకు స్వీకరించనున్నారు. దీనికి గానూ 97 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 24న పరిశీలన.. 25న అభ్యంతరాల స్వీకరణ, 26న పరిష్కారం.. 27న ఉపసంహరణ ప్రక్రియను నిర్వహించనున్నారు. పోలింగ్‌ను డిసెంబర్‌ రెండున నిర్వహించి, ఆపై కౌంటింగ్‌ను జరపనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement