టీడీపీ దౌర్జన్యాలకు భయపడం | - | Sakshi
Sakshi News home page

టీడీపీ దౌర్జన్యాలకు భయపడం

Nov 18 2026 12:08 AM | Updated on Nov 18 2026 12:08 AM

కావలి: కావలిలో పచ్చ చొక్కాలు వేసిన మగాళ్లకు గెలిచే సత్తా లేక.. అడ్డదారుల్లో పదవులను హస్తగతం చేసుకునే నీచానికి దిగారని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీ మూకలు సాగించే దౌర్జన్యాలకు భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అకారణంగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించాలని గూండాయిజానికి తెగించారని, పోలీసులు సైతం వారికే మద్దతుగా నిలబడడం దారుణమన్నారు. మున్సిపల్‌ కార్యాలయంలో జరిగిన టీడీపీ నేతల అరాచకం తర్వాత ప్రతాప్‌కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. పచ్చమూకలు సృష్టించిన అలజడి వెనుక కుట్రకోణం దాగి ఉందన్నారు. ఓటమి భయంతో అధికారం ఉందికదాని పేట్రేగిపోతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ప్రవర్తించడం ఎంత మాత్రం ఆమోద యోగ్యం కాదని తేల్చి చెప్పారు. ప్రజాస్వామ్యంలో దౌర్జన్యాలకు తావులేదనే విషయాన్ని వారు గ్రహించాలన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో మక్కే కిరణ్‌ బరిలో ఉంటే గెలవలేమన్న జంకుతో రౌడీయిజం, గూండాయిజాన్ని ప్రదర్శిస్తున్నారని చెప్పారు. ఈ ఎన్నికల్లో టీడీపీకి కావలి ప్రజలు గుణపాఠం చెబుతారని, కాలం ఒకేలా ఉండదని, మా ప్రభుత్వం వచ్చిన రోజు అరాచకాలకు పాల్పడిన ప్రతి ఒక్కరి పీచమణుస్తామని హెచ్చరించారు.

గెలిచే సత్తా లేక.. ఇంత అరాచకాలు

వైఎస్సార్‌సీపీ నామినేషన్లు తిరస్కరించి ఏకగ్రీవం చేసుకోవడమే లక్ష్యం

మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి

ప్రతాప్‌కుమార్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement