ఆప్రాన్‌ పనుల్లో నిర్లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

ఆప్రాన్‌ పనుల్లో నిర్లక్ష్యం

Nov 18 2026 12:08 AM | Updated on Nov 18 2026 12:08 AM

● మాటలకే సీఎం హామీలు పరిమితం

● మధ్యలోనే వదిలేసిన కాంట్రాక్టర్‌

● ఇసుక నిల్వతో

సోమశిల రక్షణ గోడకు ముప్పు

సోమశిల: జిల్లాకు వరప్రదాయిని అయిన సోమశిల జలాశయ ఆప్రాన్‌ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. గడువు ముగిసి ఏళ్లు గడుస్తున్నా, వర్కులు ముందుకు సాగకపోవడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో రూ.100 కోట్లను మంజూరు చేసి టెండర్లను ఆహ్వానించి పనులను ప్రారంభించి 20 శాతం మేర చేశారు. ఈ తరుణంలో ఎన్నికలొచ్చి.. అందులో విజయం సాధించి టీడీపీ కొలువుదీరింది.

అంతా బూటకం

జలాశయాన్ని సీఎం చంద్రబాబు, ఇతర మంత్రులు 2024, ఆగస్ట్‌లో సందర్శించి, పనులను 60 రోజుల్లో పూర్తి చేస్తామని ఊకదంపులు ప్రకటనలిచ్చారు. ఆపై కొన్ని రోజులకు వర్కులను కాంట్రాక్టర్‌ ప్రారంభించి, 30 శాతం సైతం చేయకుండానే బిల్లులు రాలేదంటూ మధ్యలో నిలిపేశారు. పనులు నిలిచిపోవడంతో ఆప్రాన్‌ పక్కనే ఉన్న రక్షణ గోడకు ముప్పుగా మారింది. భారీ ఇసుక డంప్‌ అలాగే ఉండిపోయి, ఆ బరువుకు గోడ పటిష్టత దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది.

వాహనదారులకూ కష్టాలే..

కలువాయికి వెళ్లే ప్రధాన రహదారి పక్కనే ఆప్రాన్‌పై ఉన్న గుంతల నుంచి ఊట, వర్షపు నీరు రోడ్డుపై ప్రవహిస్తుండటంతో ఆ ప్రాంతంలో పాచిపట్టింది. ఆప్రాన్‌ మీదుగా వెళ్లే మార్గంలోని బ్రిడ్జికి ఇరువైపులా రక్షణ గోడలు, కమ్ముల్లేకపోవడంతో వాహనదారులు భయభ్రాంతులకు గురవుతున్నారు. పనులను తక్షణమే ప్రారంభించి, పూర్తి చేయాలని ఇక్కడి వారు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement