● మున్సిపల్ చైర్మన్ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా కేతిరెడ్డి నామినేషన్
కావలి: కావలి మున్సిపల్ చైర్మన్ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా కేతిరెడ్డి శివకుమార్‌రెడ్డి సోమవారం మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డితో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన సతీమణి కేతిరెడ్డి నీరజ డమ్మీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ప్రతాప్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ మితభాషి, పట్టణ ప్రజలకు సుపరిచితుడైన శివకుమార్‌రెడ్డిని కావలి ప్రజలు ఆశీర్వదించి పట్టణాభివృద్ధికి పట్టం కట్టాలని కోరారు. వైఎస్సార్‌సీపీ ఐదేళ్ల పాలనను, కూటమి రెండున్నరేళ్ల పాలనను చూశారని, ఎవరి హయాంలో అభివృద్ధి చెందిందో కావలి ప్రజలకు తెలుసన్నారు. కావలి పట్టణం ఆది నుంచి వైఎస్సార్‌సీపీ అడ్డా అని గుర్తు చేశారు. 2014 ఎన్నికల్లోనూ వైఎస్సార్‌సీపీకి పట్టణ ప్రజలు పట్టం కట్టారని, ఆ తర్వాత టీడీపీ సాగించిన ఆరాచకం అందరికి గుర్తు ఉందన్నారు. ఈ రెండున్నరేళ్లు ప్రజా సంక్షేమానికి పంగనామాలు పెట్టారని, అభివృద్ధికి చరమగీతం పాడారని దుయ్యబట్టారు. ఇటీవల జరిగిన పుర, పరిషత్ ఎన్నికల్లో ప్రజాతీర్పును సైతం శాసించి.. అడ్డదారుల్లో కూటమి ఖాతాల్లో వేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇలాంటి అరాచక ప్రభుత్వాన్ని గెలిపిస్తే.. మనకు మనమే ఉరి వేసుకున్నట్లు అవుతుందని ప్రజలందరూ కూటమి పార్టీని కూకటి వేళ్లతో సహా పెకళించే విధంగా తీర్పు ఇవ్వాలని ప్రతాప్‌కుమార్‌రెడ్డి కోరారు.


