స్కూల్‌ వ్యాన్‌లో పెళ్లి బృందం | - | Sakshi
Sakshi News home page

స్కూల్‌ వ్యాన్‌లో పెళ్లి బృందం

Nov 17 2026 12:14 AM | Updated on Nov 17 2026 12:14 AM

● రూ.58 వేల జరిమానా విధించిన ఎంవీఐ

ఆత్మకూరు: పాఠశాల విద్యార్థులను తరలించాల్సిన వ్యాన్‌లో పెళ్లి బృందాన్ని తీసుకెళ్తుండగా రవాణా శాఖ అధికారులు పట్టుకున్నారు. పట్టణంలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలకు చెందిన వ్యాన్‌లో పెళ్లి బృందాన్ని తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం.రాములు సోమవారం తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వినియోగిస్తున్నట్లు గుర్తించి రూ.58 వేల జరిమానా విధించారు. పాఠశాల వాహనాలను కేవలం విద్యార్థుల రవాణాకే ఉపయోగించాలని ఎంవీఐ స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, మరోసారి ఇలాంటి ఘటన పునరావృతమైతే వాహన అనుమతులు రద్దు చేసేలా చర్యలు చేపడతామని స్కూల్‌ యాజమాన్యాన్ని హెచ్చరించారు.

నిలిచిపోయిన ట్రావెల్స్‌ బస్సు

● ఇబ్బందులు పడిన ప్రయాణికులు

ఉదయగిరిరూరల్‌: ట్రావెల్స్‌ బస్సు మరమ్మతులకు గురై నిలిచిపోవడంతో ప్రయాణికులు సిబ్బంది పడిన ఘటన ఆదివారం రాత్రి జరిగింది. వివరాలిలా ఉన్నాయి. మార్కాపురం జిల్లా కనిగిరి నుంచి ఎస్‌వీబీటీ ట్రావెల్స్‌ బస్సు వయా ఉదయగిరి మీదుగా బెంగళూరుకు 30 మంది ప్రయాణికులతో బయలుదేరింది. వాహనం ఉదయగిరి సబ్‌స్టేషన్‌ సమీపంలోకి రాగానే మరమ్మతులకు గురై జాతీయ రహదారిపై నిలిచిపోయింది. దీంతో డ్రైవర్‌, సిబ్బంది మరో బస్సులో వెళ్లాలని ప్రయాణికులకు సూచించారు. తమకు బస్సు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు సిబ్బందిని కోరడంతో కొంతసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న ఎస్సై సుభాషి ణి ఘటనా స్థలానికి చేరుకుని బస్సు యాజమాన్యంతో మాట్లాడి ప్రయాణికులను ప్రైవేట్‌ వాహనాల్లో బెంగళూరుకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement