నిలబడలేక.. ఇబ్బందులు పడుతూ.. | - | Sakshi
Sakshi News home page

నిలబడలేక.. ఇబ్బందులు పడుతూ..

Nov 17 2026 12:14 AM | Updated on Nov 17 2026 12:14 AM

● అగ్రిగోల్డ్‌ బాండ్ల వెరిఫికేషన్‌లో కష్టాలు

నెల్లూరు(క్రైమ్‌): అగ్రిగోల్డ్‌ బాండ్ల పరిశీలన కార్యక్రమం బాధితులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. సీఐడీ అధికారుల ఆధ్వర్యంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించిన బాండ్ల పరిశీలన ప్రక్రియ గతనెల 9వ తేదీ నుంచి నెల్లూరులోని ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్‌హాల్లో జరుగుతోంది. మండలాల వారీగా నిర్దేశిత తేదీల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వెరిఫికేషన్‌ నిర్వహిస్తున్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన అగ్రిగోల్డ్‌ బాధితులు ఉదయాన్నే నెల్లూరుకు చేరుకుంటున్నారు. వృద్ధులు, మహిళలు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు గంటల తరబడి క్యూలైన్లలో నిలబడలేక ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి తగిన సౌకర్యాలు కల్పించాలని బాధితులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement