మద్యం మత్తులో వ్యక్తి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో వ్యక్తి ఆత్మహత్య

Nov 17 2026 12:14 AM | Updated on Nov 17 2026 12:14 AM

నెల్లూరు(క్రైమ్‌): మద్యం మత్తులో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరులోని బుజబుజనెల్లూరు శివాజీ నగర్‌కు చెందిన రాజా (45) ఆటోమెకానిక్‌గా పనిచేస్తున్నాడు. అతడికి భార్య సుబ్బమ్మ, ఇద్దరు పిల్లలున్నారు. రాజా మద్యానికి బానిసయ్యాడు. తాగినప్పుడుల్లా ఇంటికొచ్చి కుటుంబ సభ్యులతో గొడపడేవాడు. దీంతో వారు అతడిని ఇంట్లో ఉంచి బయట తలుపులు వేసేవారు. ఈక్రమంలో ఆదివారం సాయంత్రం మద్యం మత్తులో గొడవ పడటంతో వారు ఎప్పటిలాగే అతడిని ఇంట్లో ఉంచి తలుపులకు గడియ పెట్టారు. కొద్దిసేపటి అనంతరం కుటుంబ సభ్యులు మాత్రల కోసం తలుపులు తెరిచి చూడగా రాజా ఉరేసుకుని కనిపించాడు. దీంతో కిందకు దించి చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే రాజా మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడి భార్య సోమవారం వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.

అదుపుతప్పి కారు బోల్తా

● నలుగురికి స్వల్ప గాయాలు

ఉదయగిరి రూరల్‌: పట్టణ శివారులోని సీతారామపురం జంక్షన్‌ వద్ద ఆదివారం రాత్రి కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వాహనంలో ప్రయాణిస్తున్న నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు.. మార్కాపురం జిల్లా దర్శిగుంటపేటకు చెందిన నలుగురు వ్యక్తులు కారులో ఉదయగిరికి వస్తున్నారు. ఈ క్రమంలో సీతారామపురం జంక్షన్‌ వద్దకు చేరుకోగానే కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. అనంతరం రోడ్డు మార్జిన్‌ దాటి గుంతలోకి దూసుకెళ్లింది. ప్రమాదాన్ని గమనించిన వాహనదారులు క్షతగాత్రులను 108 వాహనంలో స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement