ప్రీమెచ్యూర్ శిశువుల భవిష్యత్‌పై తల్లిదండ్రులు ఆశలు వదులుకోవాల్సిన అవసరం లేదు. ఆధునిక వైద్యంతో కాపాడే అవకాశం ఉంది. నెల్లూరులోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో 40 పడకల ఎన్ఐసీయూ, అవసరమైన ఇంక్యుబేటర్లు అందుబాటులో ఉన్నాయి. శిశువుల ఊపిరితిత్తులు, గుండె, మెదడు అభివృద్ధికి అవసరమైన ఖరీదైన ఇంజెక్షన్లతోపాటు ప్రత్యేక వైద్య సేవలను ఉచితంగా అందిస్తున్నారు. ఇతర ఆస్పత్రుల్లో జన్మించిన శిశువులకు కూడా ఇక్కడ వైద్యం అందిస్తున్నాం. ఒక్కోసారి మూడు నెలల వరకు ఇంక్యుబేటర్లలో ఉంచి చికిత్స అందించి శిశువులను క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగిస్తున్నాం.
– డాక్టర్ లక్ష్మీప్రసన్న, గైనకాలజిస్ట్,
నియోనేటాలజిస్ట్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి


