నిబంధనలతో మాకేం పని.. | - | Sakshi
Sakshi News home page

నిబంధనలతో మాకేం పని..

Nov 15 2026 11:44 PM | Updated on Nov 15 2026 11:44 PM

● యథేచ్ఛగా గ్రావెల్‌ తరలింపు

● మూడు రోజులుగా

భారీ యంత్రాలతో తవ్వకాలు

సోమశిల: అనంతసాగరం మండలంలో ఎలాంటి నిబంధనలు పాటించకుండా, యథేచ్ఛగా చెరువు భూములు తవ్వేస్తూ గ్రావెల్‌ తరలిస్తున్నారు. మూడు రోజులుగా జేసీబీలతో అనంతసాగరం చెరువులో అక్రమ తవ్వకాలు సాగుతున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెరువు గట్టుకు అతి సమీపంలో సుమారు 4 అడుగుల లోతు వరకు గ్రావెల్‌ను తవ్వి తరలిస్తున్నారు. ఇక్కడ తవ్విన గ్రావెల్‌ను ఉప్పలపాడు పెన్నా నది నుంచి ఇసుక తరలించేందుకు తాత్కాలిక రోడ్లు వేయడానికి ఉపయోగిస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువు భూముల్లో ఇంతలా గోతులు తవ్వితే అక్కడికి మేతకు వెళ్లే పశువులు, రాత్రి సమయాల్లో మనుషులు పొరపాటున వాటిల్లో పడితే ప్రాణనష్టం జరిగే అవకాశం ఉంది. తవ్వకాలపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రశ్నిస్తే అక్కడ ఉండే నిర్వాహకులు మేము మైనింగ్‌ రాయల్టీ కడుతున్నాం. అడగడానికి మీరెవరంటూ సమాధానమిస్తున్నారు. పట్టపగలే చెరువులో తవ్వకాలు జరిపి టిప్పర్లలో తరలిస్తున్నా సంబంధిత రెవెన్యూ, ఇరిగేషన్‌, మైనింగ్‌ అధికారులు కన్నెత్తి చూడకపోవడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి తవ్వకాలను నిలిపివేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement