తీరంలో రాకాసి అలలు.. ప్రజల్లో ఆందోళన | - | Sakshi
Sakshi News home page

తీరంలో రాకాసి అలలు.. ప్రజల్లో ఆందోళన

Nov 15 2026 11:44 PM | Updated on Nov 15 2026 11:44 PM

వాకాడు: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మండలంలోని తూపిలిపాళెం సముద్రం ఆదివారం అల్లకల్లోలంగా మారింది. రెండు రోజులుగా అలల ఉధృతి పెరగడంతో తీర గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అలలు సుమారు 10 మీటర్ల మేర ముందుకొచ్చి తీరాన్ని తాకుతున్నాయి. దీంతో తీర ప్రాంతాల్లో నిలిపి ఉంచిన బోట్లను మత్స్యకారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులతో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయోనని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 19వ తేదీ నాటికి తుఫాన్‌ పరిస్థితులు ఏర్పడవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు, తీర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. తిరుపతి, నెల్లూరు జిల్లాల తీర ప్రాంతాలపై తుపాను ప్రభావం ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని కావలి, ఇందుకూరుపేట, బోగోలు, దగదర్తి, రామతీర్థం, తోటపల్లిపాళెం, గూడూరు, ముత్తుకూరు, చిల్లకూరు, కోట, వాకాడు, తడ, సూళ్లూరుపేట తదితర తీర ప్రాంత మండలాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement