బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ పోటీలు నేడు | - | Sakshi
Sakshi News home page

బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ పోటీలు నేడు

Nov 14 2026 7:45 AM | Updated on Nov 14 2026 7:45 AM

నెల్లూరు(టౌన్‌): ఇందుకూరుపేట మండలం పల్లిపాడు డైట్‌లో శుక్రవారం 32వ జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ (ఎన్‌సీఎస్‌సీ) – 2026 జిల్లా స్థాయి ప్రాజెక్ట్‌ల పోటీలు నిర్వహించనున్నట్లు డీఈఓ ఆర్‌.బాలాజీరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్‌సీఎస్‌సీ పోర్టల్లో రిజిస్టర్‌ చేసుకున్న విద్యార్థుల్లో ఒక్కొక్కరు తమ గైడ్‌ టీచర్‌తో కలిసి ప్రాజెక్ట్‌ నివేదికతో పోటీలకు హాజరుకావాలని సూచించారు. విద్యార్థులు ప్రాజెక్ట్‌ నివేదిక (ఒరిజినల్‌, జెరాక్స్‌ ప్రతులు), పూర్తి వివరాలతో కూడిన ప్రాజెక్ట్‌ లాగ్‌బుక్‌, రిజిస్ట్రేషన్‌ సమయంలో అప్‌లోడ్‌ చేసిన ప్రధానోపాధ్యాయుడి సంతకంతో కూడిన రిజిస్ట్రేషన్‌ ఫారం తప్పనిసరిగా తీసుకురావాలని పేర్కొన్నారు. ప్రాజెక్ట్‌ వివరాలు, పరిశీలనలు, సేకరించిన సమాచారం, గణాంకాలు, ఫలితాలను స్పష్టంగా వివరించేలా విద్యార్థులకు గైడ్‌ టీచర్లు తగిన మార్గదర్శనం అందించాలన్నారు. వివరాలకు 94404 39684, 94404 51778, 94938 14915 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

ప్రశాంతంగా

ఎల్‌ఎల్‌బీ పరీక్షలు

వెంకటాచలం: విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం పరిధిలోని అనుబంధ కళాశాలల్లో గురువారం ఎల్‌ఎల్‌బీ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని వర్సిటీ ఎగ్జామ్స్‌ నిర్వహణాధికారి డాక్టర్‌ ఆర్‌.మధుమతి తెలిపారు. ఉదయం నిర్వహించిన ఐదేళ్ల ఏడో సెమిస్టర్‌ పరీక్షకు 67 మంది విద్యార్థులకు గానూ 61 మంది హాజరైనట్లు వెల్లడించారు. మధ్యాహ్నం నిర్వహించిన తొమ్మిదో సెమిస్టర్‌ పరీక్షకు 85 మందికి గానూ 83 మంది హాజరయ్యారని తెలిపారు.

మూడు సవర్ల బంగారం, వెండి, నగదు చోరీ

గూడూరు: పట్టణంలోని సంయుక్తా నగర్‌లో గురువారం పట్టపగలు దొంగలు రెచ్చిపోయారు. ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లగా మూడు గంటల వ్యవధిలో చోరీకి పాల్పడ్డారు. పోలీసుల కథనం మేరకు.. సంయుక్తా నగర్‌ చెందిన కసుకుర్తి కోటేశ్వరరావు ఉదయం 11 గంటల సమయంలో ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లారు. తిరిగి మధ్యాహ్నం రాగా తలుపులు తెరిచి ఉన్నాయి. లోపలికి వెళ్లి చూడగా బీరువాలోని సుమారు 3 సవర్ల బంగారు ఆభరణాలు, కొన్ని వెండి వస్తువులు, నగదు కనిపించలేదు. దీంతో ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు క్లూస్‌టీమ్‌ను పిలిపించి వేలిముద్రలు సేకరించారు. కేసు నమోదు చేసినట్లుగా సీఐ శ్రీనివాసరావు తెలిపారు.

దూడల కాలువ వద్ద

మృతదేహం

గూడూరు: పట్టణంలోని సంగం థియేటర్‌ సమీపంలోని దూడల కాలువ వద్ద గురువారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వారి సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వయసు 40 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. 5.8 అడుగుల ఎత్తు ఉన్నాడు. నీలం రంగు జీన్స్‌ ప్యాంట్‌, ఆకుపచ్చ రంగు టీషర్ట్‌ ధరించి ఉన్నాడు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు సంప్రదించాలని ఒకటో పట్టణ పోలీసులు కోరారు.

నిమ్మ ధరలు (కిలో)

పెద్దవి : రూ.70

సన్నవి : రూ.40

పండ్లు : రూ.15

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement