● రూ.2 లక్షల ఆస్తి నష్టం
దగదర్తి: మండల కేంద్రంలోని పాత హరిజనవాడలో గురువారం సాయంత్రం విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. పైడి వెంకట్రామయ్య అనే వ్యక్తి ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదం కారణంగా గృహోపకరణాలు కాలిపోయాయి. ఇల్లంతా దట్టమైన పొగ వ్యాపించింది. దీంతో చుట్టుపక్కల నివాసితులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్పందించిన స్థానికులు నీటిని చల్లి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.2 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. స్థానికులు సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది.


