● పెంటోగ్రాఫ్ విరిగి నిలిచిపోయిన మెమూ
● మూడు గంటల పాటు ప్రయాణికుల ఇబ్బందులు
గూడూరు: చైన్నె నుంచి నెల్లూరు వెళ్లే మెమూలో సాంకేతిక లోపం తలెత్తడంతో దాదాపు మూడు గంటల పాటు వివిధ రైళ్లకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గూడూరు జంక్షన్‌కు సమీపంలోని ఓడూరు రైల్వేస్టేషన్లో.. రైలు ఇంజిన్ పైభాగంలో విద్యుత్‌ను సరఫరా చేసే పెంటోగ్రాఫ్ విరిగిపోయింది. దీంతో మెయిన్ లైన్‌లో మెమూ ఆగిపోవడంతో చైన్నె నుంచి విజయవాడ వైపు వెళ్లే నవజీవన్, విశాఖ ఎక్స్‌ప్రెస్‌తో పాటు మరికొన్ని రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరమ్మతులు చేపట్టేందుకు యత్నించినా, ప్రయోజనం లభించలేదు. చివరికి గూడూరు నుంచి మరో ఇంజిన్‌ను పంపి.. మెమూను తీసుకొచ్చారు. ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.


