నెల్లూరు (టౌన్): కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులను గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి చేశారు. సాంకేతికతతో కూడిన విద్యను నాటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అందుబాటులోకి తీసుకొచ్చారు. గవర్నమెంట్ పాఠశాలల్లో స్మార్ట్ టీవీలు, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్, ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లను ఉచితంగా అందజేశారు. అయితే కూటమి ప్రభుత్వం కొలువుదీరాక స్మార్ట్ బోధనకు మంగళం పాడింది. ఎనిమిదో తరగతి స్టూడెంట్స్‌కు ఇచ్చే ట్యాబ్‌ల ఎగవేతకు శ్రీకారం చుట్టింది.
ప్రైవేట్ స్కూళ్లకే ప్రాధాన్యం
టీడీపీ సర్కార్ ఏర్పడిన నాటి నుంచి ప్రైవేట్ స్కూళ్లకే అధిక ప్రాధాన్యమిస్తోంది. నాటి ప్రభుత్వం అమలు చేసిన సీబీఎస్‌ఈ సిలబస్, ఇంగ్లిష్ మీడియం, టోఫెల్ తరహా పరీక్ష విధానం తదితరాలను పూర్తిగా ఎత్తేసింది. విద్యాసంస్థలకు అధిపతైన వ్యక్తి మంత్రి కావడంతో ఈ రకంగా వ్యవహరిస్తూ.. ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేస్తోందనే భావన సర్వత్రా నెలకొంది.
యాప్ ద్వారా బోధన
ప్రభుత్వ పాఠశాలల్లో నాలుగు నుంచి పదో తరగతి వరకు చదువుతున్న 1,47,907 మంది విద్యార్థులకు యాప్ ద్వారా క్లాసుకు సంబంధించిన కంటెంట్‌ను అప్‌లోడ్ చేసేవారు. ఇంగ్లిష్ లెర్నింగ్ యాప్‌నూ ఉచితంగా అందజేసేవారు. వర్చువల్ పద్ధతిలో ప్రశ్నలు, జవాబులు.. విద్యార్థి స్వయంగా నేర్చుకునేలా విధంగా రూపకల్పన చేశారు. యానిమేషన్, బొమ్మలు, గ్రాఫిక్స్ ద్వారా సులభంగా నేర్చుకునేలా తీర్చిదిద్దారు. సోషల్, మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టులను ఇంగ్లిష్‌తో పాటు తెలుగులోనూ అందుబాటులో ఉంచారు.
నేడన్నీ కోతలే..
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే సాంకేతిక విద్య, ట్యాబ్‌లకు కూటమి ప్రభుత్వం మంగళం పాడింది. సర్కార్ కొలువుదీరి 30 నెలలు దాటినా, కొత్తగా ఒక్క ట్యాబ్‌ను సైతం అందజేయలేదు. మరోవైపు సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయకోవడంతో చాలా వరకు పనిచేయడంలేదు. కొన్నైతే అసలు మొరాయిస్తున్నాయి. ట్యాబ్‌లో సాంకేతిక లోపం ఏర్పడితే గతంలో వెంటనే పరిష్కరించేవారు. అయితే ప్రస్తుతం ఇలాంటివేవీ జరగడంలేదు. పాఠశాలలకు ఇచ్చిన స్మార్ట్ టీవీలు, ఐఎఫ్పీలు సైతం మరమ్మతులకు గురైనా, వీటిని బాగుచేసే దిశగా ఎలాంటి చర్యలను చేపట్టడంలేదు. ఫలితంగా సర్కారీ బడుల్లో చదువుతున్న విద్యార్థులు సాంకేతిక విద్యకు దూరమవుతున్నారు.
గత ప్రభుత్వ హయాంలో అందజేసిన ట్యాబ్‌లను చూపుతున్న విద్యార్థులు (ఫైల్)
వైఎస్సార్సీపీ హయాంలో పంపిణీ
వరుసగా రెండేళ్ల పాటు ఎనిమిదో తరగతి విద్యార్థులకు అందజేత
టీడీపీ అధికారంలోకి వచ్చాక మొండిచేయి
సాంకేతిక సమస్యలతో స్టూడెంట్స్ కష్టాలు
జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ట్యాబ్‌లను అందజేసే విధానానికి 2022లో శ్రీకారం చుట్టారు. ఇలా 21,092 మందికి అందజేశారు. రెండేళ్ల పాటు వీటిని 42,184 మంది అందుకున్నారు. ప్రైవేట్ సంస్థ అందించిన కంటెంట్‌ను అప్‌లోడ్ చేసి ఒక్కో స్టూడెంట్‌పై రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు వెచ్చించారు. తొమ్మిది, పదో తరగతులకు వెళ్లిన సమయంలో ఆయా క్లాసులకు సంబంధించిన కంటెంట్‌ను అప్‌గ్రేడ్ చేసేవారు.


