పోలింగ్‌లో ఖాకీల తీరుపై హైకోర్టుకు.. | - | Sakshi
Sakshi News home page

పోలింగ్‌లో ఖాకీల తీరుపై హైకోర్టుకు..

Nov 14 2026 12:29 AM | Updated on Nov 14 2026 12:29 AM

● పిటిషన్‌ను దాఖలు చేయనున్న

మాజీ ఎమ్మెల్యే విక్రమ్‌రెడ్డి

ఆత్మకూరు: పరిషత్‌ ఎన్నికల్లో పోలీసులు వ్యవహరించిన తీరుపై హైకోర్టును ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి ఆశ్రయించనున్నారు. మర్రిపాడులోని తిక్కవరానికి వెళ్లనీయకుండా ఆయన్ను ఆత్మకూరు సీఐ, మర్రిపాడు ఎస్సై అడ్డుకున్న తీరుపై ఆ రోజున ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. పోలింగ్‌ రోజున ఖాకీలు ప్రదర్శించిన అత్యుత్సాహం, టీడీపీకి మద్దతుగా వ్యవహరించిన వైనంపై న్యాయస్థానంలో పిటిషన్‌ను దాఖలు చేయనున్నారు.

రిగ్గింగ్‌ను అడ్డుకునేందుకు వెళ్తుండగా..

మర్రిపాడు మండల పరిషత్‌ ఎన్నికల పోలింగ్‌ చీఫ్‌ ఏజెంట్‌గా పాస్‌ను విక్రమ్‌రెడ్డి పొందారు. గెలవలేమనే భయంతో అవకాశమున్న చోట మంత్రి ఆనం అండచూసుకొని రిగ్గింగ్‌కు టీడీపీ నేతలు పాల్పడ్డారు. ఆత్మకూరు మండలంలోని బొటికర్లపాడు.. మర్రిపాడులోని తిక్కవరంలో భయానక వాతావరణాన్ని సృష్టించి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏజెంట్లను పోలింగ్‌ కేంద్రం నుంచి తరిమేసి రిగ్గింగ్‌ చేశారు. దీనిపై సమాచారం అందడంతో తిక్కవరం వెళ్లేందుకు గానూ మర్రిపాడుకు విక్రమ్‌రెడ్డి చేరుకున్నారు. అయితే అప్పటికే అక్కడికి చేరుకున్న ఆత్మకూరు సీఐ గంగాధర్‌ ఆయన వాహనానికి అడ్డుగా నిలిచి గ్రామానికి వెళ్లడానికి వీల్లేదంటూ నిలిపేశారు. తనను పంపాలని విక్రమ్‌రెడ్డి కోరినా, ససేమిరా అన్నారు. పోలీసుల తీరుపై తమ వద్ద ఉన్న సాక్ష్యాధారాలు, వీడియోల ఆధారంగా హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ను దాఖలు చేయనున్నారు. పంచాయతీ ఎన్నికల్లోనూ పోలీసుల అండతో అక్రమాలకు టీడీపీ పాల్పడే అవకాశముందని, ఇలాంటి అధికారులను కట్టడి చేయాలని పిటిషన్‌లో ఆయన కోరనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement