● ఇవ్వడానికి సిద్ధమైన టీడీపీ కౌన్సిలర్
● బీజేపీ, జనసేన ఆశలు అడియాశలేనా..?
ఆత్మకూరు: ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఆత్మకూరు మున్సిపాల్టీలో చైర్‌పర్సన్, కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారాన్ని ఈ నెల 23న చేపట్టనున్నారు. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఎవరి పేరును ప్రకటిస్తే వారే వైస్ చైర్మనయ్యే పరిస్థితి నెలకొనడంతో పలువురు ఆశావహులు మంతనాలు సాగిస్తున్నారు. ఇదిలా ఉండగా టీడీపీ తరఫున విజయం సాధించిన ఓసీ కౌన్సిలర్ తనకు వైస్ చైర్మన్ పదవిని ఇస్తే రూ.50 లక్షలను ముట్టజెప్తానని పలువురితో బహిరంగంగా అన్నారని సమాచారం. ప్రస్తుతం ఇదే విషయం పట్టణంలో హాట్‌టాిపిక్‌గా మారింది. తనకు పదవిని ఇవ్వాలని మంత్రి వద్ద టీడీపీ పట్టణాధ్యక్షుడు ప్రస్తావించారని సమాచారం. అయితే రెండు పదవులనూ ఒకే సామాజికవర్గానికి ఇవ్వడం సమంజసంకాదంటూ సున్నితంగా తిరస్కరించారని తెలుస్తోంది. ప్రస్తుతం మున్సిపాల్టీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పది.. మిత్రపక్షమైన సీపీఎంకు ఒకటి.. టీడీపీకి 12.. జనసేనకు మూడు.. బీజేపీ, స్వతంత్ర అభ్యర్థులకు ఒకటి చొప్పున ఉన్నాయి.
అవకాశమొస్తుందా..?
టీడీపీ మిత్రపక్షాలైన జనసేన, బీజేపీ సైతం వైస్ చైర్మన్ పదవి కోసం ఆశలు పెంచుకున్నాయి. అయితే టీడీపీలోనే ఎక్కువ మంది పోటీదారులు ఉండటంతో తమకు అవకాశమొస్తుందాననే అయోమయంలో వీరున్నారు. 2014 – 19లో ఏఎంసీ చైర్మన్ పదవిని తమకు కేటాయించారని, కేంద్రంలో అధికారంలో ఉన్న తమకు వైస్ ఛైర్మన్ పదవిని ఇవ్వాలని బీజేపీ వర్గాలు కోరుతున్నాయి.
మరోసారి భంగపాటుకు గురికాలేను..!
ఈ క్రమంలో ఇటీవల ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిని స్థానిక నేతలు కలిసి ఇదే విషయమై మంత్రితో మాట్లాడాలని కోరారు. తన సొంత మండలమైన సంగంలో ఓ ఎంపీటీసీ స్థానాన్ని కేటాయించాలని కోరి భంగపడ్డానని, వైస్ చైర్మన్ పదవిని కోరి మరోసారి అవమానానికి గురికాలేనంటూ సదరు నేత చెప్పారని సమాచారం.
గ్లాస్ పార్టీ తీరూ ఇంతే..
జనసేనకు ముగ్గురు కౌన్సిలర్లున్నారు. మరోవైపు ఆ పార్టీ రెబల్ అభ్యర్థి 12వ వార్డులో గెలుపొందారు. ఇలా మొత్తం నాలుగు స్థానాలున్న తమకు వైస్ చైర్మన్ పదవిని ఇవ్వాలని వారు కోరుతున్నారు. 28 వార్డుల్లో ఏడుగురు బీసీలు గెలుపొందారని, వీరిలో ఒకరికి ఇ వ్వాలనే డిమాండ్ సైతం వినిపిస్తోంది. మున్సిపాల్టీగా రూపాంతరం చెందాక ఇప్పటి వరకు పదవులను తాము పొందలేదని, ఈసారైనా న్యాయం చేయాలని ఎస్సీలు కోరుతున్నారు. ఈ పదవి కోసం పోటీ ఎక్కువవడంతో ఎవరికి న్యాయం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది.
పదవిని ఇస్తే
రూ.50 లక్షలిస్తా..! పదవి ఇస్తారంటావా..?


