● డీఎంహెచ్ఓ సుజాత
నెల్లూరు(వేదాయపాళెం): జిల్లా వ్యాప్తంగా 175 ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, వసతి గృహాలకు 9,473 దోమతెరలు పంపిణీ చేస్తున్నట్లుగా డీఎంహెచ్ఓ సుజాత తెలిపారు. నెల్లూరులోని పొదలకూరు రోడ్డులో ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ బాలుర గురుకులంలో శుక్రవారం జేవీఆర్ కాలనీ పట్టణ ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో విద్యార్థులకు దోమతెరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని ఆరోగ్య కేంద్రాల పరిధిలోని వసతి గృహాల్లో విద్యార్థుల సంఖ్యను బట్టి అవసరమైనన్ని దోమతెరలు అందజేస్తామన్నారు. దోమతెరలు వినియోగించడం ద్వారా దోమకాటు వల్ల వచ్చే మలేరియా, ఫైలేరియా, చికెన్‌గున్యా, జపనీస్ ఎన్సెఫలైటిస్ (జేఈ), కాలాజార్, జికా, డెంగీ వంటి వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి ఎం.సింహాచలం, నెల్లూరు మున్సిపల్ మలేరియా అధికారిణి జిజియాబాయి, పట్టణ సబ్యూనిట్ అధికారి ఎస్.సీహెచ్ రామారావు, గురుకులం ప్రిన్సిపల్ దైవసహాయం తదితరులు పాల్గొన్నారు.


