రీ సర్వే పనుల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

రీ సర్వే పనుల పరిశీలన

Nov 11 2026 11:55 PM | Updated on Nov 11 2026 11:55 PM

సంగం: మండలంలో జరుగుతున్న రీసర్వే పనులను జేసీ మొగిలి వెంకటేశ్వర్లు బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయంలో సిబ్బందితో మాట్లాడారు. సర్వే జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ముందస్తు నోటీసులు అందించి, భూములకు సంబంధించిన డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరమే సర్వే నిర్వహిస్తున్నట్లు రైతులు తన దృష్టికి తీసుకొచ్చారని జేసీ తెలిపారు. దువ్వూరు గ్రామంలో రెండు బృందాల ద్వారా సర్వే నిర్వహిస్తున్నామన్నారు. ఒక బృందం పరిధిలో 8 ఎకరాలు, మరో బృందం పరిధిలో 400 ఎకరాల సర్వే మాత్రమే మిగిలి ఉందని వివరించారు. మిగిలిన పనులను మరో 10 నుంచి 15 రోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. మండలంలో 17 గ్రామాలకు గానూ ఇప్పటివరకు 9 గ్రామాల్లో రీసర్వే ప్రక్రియ పూర్తయిందన్నారు. మిగిలిన వాటిల్లో రెండు గ్రామాలు డ్రాఫ్ట్‌ ల్యాండ్‌ రికార్డ్‌ దశకు చేరుకున్నాయని, వాటిని వారం రోజుల్లో తుదిదశకు తీసుకురానున్నట్లు వెల్లడించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సర్వే పనుల పురోగతిని తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించినట్లు స్పష్టం చేశారు. కార్యక్రమం లో తహసీల్దార్‌ సారంగపాణి, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement