సంగం: మండలంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న 15 ఏళ్ల విద్యార్థి దారా దీక్షిత్‌కు ఇద్దరు బాలురు బలవంతంగా పురుగు మందు తాగించిన ఘటనపై పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు. బుధవారం సంగం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయంలో ఆత్మకూరు డీఎస్పీ వెంకటేశ్వర్లు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. అక్టోబర్ 31వ తేదీన ఈ ఘటన జరగ్గా, బాధిత విద్యార్థి ప్రస్తుతం చైన్నెలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఈనెల 10వ తేదీన ఇద్దరు బాలురపై బీఎన్‌ఎస్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, విచారణలో వెల్లడయ్యే వాస్తవాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు. సమావేశంలో సీఐ శ్రీనివాసరెడ్డి, ఎస్సై భోజ్యా నాయక్ పాల్గొన్నారు.


