నగరంలో కొందరు వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు. పోలీసులు, రవాణా శాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నా మార్పు కనిపించడం లేదు. ప్రధాన రహదారులపై ఉదయం వేళల్లో టిప్పర్లు తిరుగుతున్నాయి. కొందరు రాంగ్ రూట్లో ప్రయాణిస్తూ ఇతర వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. విద్యార్థులు ట్రిపుల్ రైడింగ్ చేస్తుండగా, మరికొందరు సెల్ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడుపుతున్నారు. ఇలాంటి నిర్లక్ష్యపు ప్రయాణం ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉన్నా పట్టించుకోవడం లేదు. ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా అధికారులు మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు
ఒకే బైక్పై వెళ్తున్న ముగ్గురు యువతులు
ఫోన్ మాట్లాడుతూ..
ఎలా పడితే అలా వెళ్తూ..
రాంగ్ రూట్లో వెళ్తున్న ఆటోలో ఇలా..
విద్యార్థుల ట్రిపుల్ రైడింగ్


