వైఎస్సార్‌సీపీలో టీడీపీ నాయకుల చేరిక | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలో టీడీపీ నాయకుల చేరిక

Nov 18 2026 12:08 AM | Updated on Nov 18 2026 12:08 AM

సీతారామపురం: మండలంలోని మారంరెడ్డిపల్లి పంచాయతీకి చెందిన పలువురు టీడీపీ నాయకులు ఆ పార్టీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరారు. మంగళవారం మాజీ ఎంపీపీ పద్మావతి, వైఎస్సార్‌సీపీ నాయకులు చింతంరెడ్డి లోకేశ్‌రెడ్డి, కల్లూరి ప్రతాప్‌రెడ్డితో కలిసి బ్రాహ్మణపల్లికి వెళ్లి ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్‌రెడ్డి సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వడ్డిపల్లి జానయ్య, మంకెన రాయప్ప, కలివెల శ్రీవరాజు, గంగిపోగు వెంగయ్య, కలివెల నాగయ్య, వడ్డిపల్లి గురవయ్య, వడ్డిపల్లి దేవరాజు, కలివెల బుజ్జి, కలివెల రాజు, మంకెన కిరణ్‌, సిరిగిరి సూర్య తదితరులకు మేకపాటి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల వేళ సుమారు 30 కుటుంబాలు టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరడం శుభపరిణామమన్నారు. వారికి తగిన ప్రాధాన్యత కల్పిస్తామని తెలిపారు. కూటమి నాయకుల వ్యవహారశైలి నచ్చక, వైఎస్సార్‌సీపీపై అభిమానంతో పార్టీలో చేరినట్లు నూతనంగా చేరిన నాయకులు తెలిపారు. పార్టీ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement