వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి, పార్టీ నియోజకవర్గ ముఖ్య నేతలు మర్యాదపూర్వకంగా బుధవారం కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు.
ఎల్‌ఎల్‌బీ పరీక్షలు ప్రారంభం
వెంకటాచలం: విక్రమ సింహపురి యూనివర్సిటీ పరిధిలోని అనుబంధ కళాశాలల్లో ఎల్‌ఎల్‌బీ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఉదయం నిర్వహించిన పరీక్షకు 455 మందికి గానూ 51 మంది గైర్హాజరయ్యారని నిర్వహణాధికారి మధుమతి తెలిపారు. మధ్యాహ్నం 437 మందికి గానూ 397 మంది హాజరయ్యారని వివరించారు.
డ్వామా కార్యాలయంలో
సామాజిక తనిఖీ
నెల్లూరు(పొగతోట): తోటపల్లిగూడూరుకు సంబంఽధించిన సామాజిక తనిఖీ ప్రక్రియను నగరంలోని డ్వామా కార్యాలయంలో బుధ వారం నిర్వహించారు. పంచాయతీల వారీగా చేపట్టిన ఉపాఽధి హామీ పనులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. డ్వామా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
పీహెచ్‌సీలో
ఆకస్మిక తనిఖీ
దగదర్తి: స్థానిక పీహెచ్‌సీలో ఆకస్మిక తనిఖీలను డీఎంహెచ్‌ఓ సుజాత బుధవారం చేపట్టారు. ల్యాబ్, ఫార్మసీ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం వైద్యాధికారి అఖిలతో పాటు సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనే గర్భిణులు ప్రసవాలు చేయించుకునేలా ప్రోత్సహించాలని కోరారు. ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించేందుకు వైద్యులు, సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని పేర్కొన్నారు.
ఆర్వోలకు శిక్షణ
నెల్లూరు(పొగతోట): రాష్ట్ర ఎన్నికల కమిషన్ నియమావళిని అనుసరించి గ్రామ పంచాయతీ ఎలక్షన్ల ప్రక్రియను పూర్తి చేయాలని జెడ్పీ సీఈఓ మధుసూదన్ సూచించారు. ఎన్నికల నిర్వహణపై నగరంలోని కస్తూర్బా కళాక్షేత్రంలో ఆర్వోలకు బుధవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రక్రియను సమర్థంగా పూర్తి చేయాలని సూచించారు. పంచాయతీ ఎన్నికలు మూడు దశల్లో జరగనున్నాయని, ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్, ఆపై కౌంటింగ్‌ను నిర్వహించాలని పేర్కొన్నారు. డీపీఓ వెంకటరామన్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల విధులకు
దివ్యాంగ ఉద్యోగులు దూరం
నెల్లూరు(పొగతోట): ఎన్నికల విధుల నుంచి దివ్యాంగ ఉద్యోగులను దూరంగా ఉంచాలంటూ ఉత్తర్వులను రాష్ట్రాధికారులు జారీ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల విధులకు వేల సంఖ్యలో ఉద్యోగుల అవసరం ఉంది. ఆయా శాఖల వారీగా వివరాలను సేకరించి అందరికీ డ్యూటీలేస్తున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు గానూ 2400 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంది.


