● రాత్రి వరకు కొనసాగిన రిజిస్ట్రేషన్లు
నెల్లూరు సిటీ: జిల్లాలోని రిజిస్ట్రార్ కార్యాలయాలు బుధవారం కిటకిటలాడాయి. ఎన్నికల ప్రభావంతో కొద్ది రోజులుగా బోసిపోయిన ఇవి ప్రస్తుతం సందడిగా మారాయి. ఎలక్షన్ల నేపథ్యంలో నగదును తీసుకెళ్లడం, పెద్ద మొత్తంలో లావాదేవీలను నిర్వహించడం ఇబ్బందికరంగా మారుతుందనే ఆందోళన కొందరిలో నెలకొంది. దీంతో స్థిరాస్తుల క్రయవిక్రయాలను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. ఫలితంగా రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రోజువారీ లావాదేవీలు తగ్గిపోయాయి. అయితే ప్రస్తుతం నగరంలోని స్టోన్‌హౌస్‌పేట, మద్రాస్ బస్టాండ్ ప్రాంతాల్లోని ప్రధాన రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద రద్దీ నెలకొంది. డాక్యుమెంట్లతో కక్షిదారులు చేరుకుంటున్నారు. వాహనాల పార్కింగ్‌కు సైతం స్థలం సరిపోని పరిస్థితి నెలకొంటోంది. రిజిస్ట్రేషన్ల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. పెండింగ్‌లో ఉన్న వాటిని పూర్తి చేసేందుకు అధికారులు, సిబ్బంది రాత్రి వరకు విధులు నిర్వర్తించారు.


