శ్రీవారి దర్శనానికి 15 గంటలు | - | Sakshi
Sakshi News home page

శ్రీవారి దర్శనానికి 15 గంటలు

Nov 11 2026 11:55 PM | Updated on Nov 11 2026 11:55 PM

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ బుధవారం ఎక్కవగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు నిండిపోయి... కృష్ణ తేజ అతిథిగృహం వద్దకు క్యూ చేరుకుంది. స్వామివారిని 78,085 మంది మంగళవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 26,232 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.3.83 కోట్లను సమర్పించారు. టైమ్‌ స్లాట్‌ టికెట్లున్న వారికి సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 15 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లున్న వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement