రాకపోకలంటేనే హడల్‌ | - | Sakshi
Sakshi News home page

రాకపోకలంటేనే హడల్‌

Nov 11 2026 12:25 AM | Updated on Nov 11 2026 12:25 AM

సైదాపురం: మండలంలోని ఆర్‌ అండ్‌ బీ రోడ్లు దుర్భరంగా మారాయి. గుంతలు ఏర్పడినా, వాటిని పూడ్చే దిశగా ఎలాంటి చర్యలు చేపట్టడంలేదు. ఫలితంగా సైదాపురం నుంచి పొదలకూరుకు వెళ్లే రహదారిలో అడుగుకో గుంత దర్శనమిస్తోంది. దాదాపు 23 కిలోమీటర్లున్న ఈ రహదారిలో సుమారు పది కిలోమీటర్లలో ప్రయాణం వాహనదారులకు చుక్కలను చూపుతోంది. దాదాపు గంట పడుతోందని వాహనదారులు మండిపడుతున్నారు. మరోవైపు గుంతల్లో వర్షపు నీరు నిలుస్తుండటంతో ప్రమాదాల బారిన పడాల్సి వస్తోంది. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

ట్రాక్టర్‌ బోల్తా: వ్యక్తి మృతి

వెంకటగిరి రూరల్‌: ట్రాక్టర్‌ బోల్తాపడిన ఘటనలో వ్యక్తి మృతి చెందిన ఘటన బాలాయపల్లి మండలంలోని జయంపులో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు.. స్థానిక గిరిజన కాలనీకి చెందిన సంజీవయ్య (37).. జయంపు సమీపంలోని పొలంలో ట్రాక్టర్‌ ద్వారా దుక్కి దున్నుతున్నారు. ఈ క్రమంలో ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తాపడింది. బురదలో సంజీవయ్య ఇరుక్కపోయి ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందారు. జేసీబీ సాయంతో ట్రాక్టర్‌ను పక్కకు తొలగించి మృతదేహాన్ని వెలికి తీశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement