● సైదాపురం జెడ్పీటీసీగా విద్యావంతురాలు
సైదాపురం: మండల జెడ్పీటీసీ స్థానానికి వైఎస్సార్సీపీ తరఫున వెందోటి సునీత పోటీ చేసి గెలుపొందారు. ఈమె ఉన్నత విద్యావంతురాలు. ఎంఏ బీఈడీ చేశారు. సైదాపురానికి చెందిన రాజేష్‌తో సునీతకు వివాహమైంది. రాజేష్ మొదటి నుంచి సైదాపురం వైఎస్సార్సీపీ కన్వీనర్ మన్నారపు రవికుమార్ యాదవ్ అనుచరుడిగా ఉన్నారు. జెడ్పీటీసీ స్థానం ఎస్టీ మహిళకు రిజర్వ్ అయింది. దీంతో వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి ఆశీస్సులతో సునీత పోటీ చేశారు. అధికార పార్టీ ఎన్ని కుట్రలు పన్నినా అత్యధిక మెజార్టీతో విజయం సాధించారు. రామ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ సైదాపురం జెడ్పీటీసీ స్థానాన్ని కై వసం చేసుకోవడం అందరి సమష్టి పోరాటానికి నిదర్శనమన్నారు. ఈ విజయాన్ని అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి కానుకగా ఇస్తామన్నారు.


