● ఎస్ఈ సుధాకర్
నెల్లూరు(వీఆర్సీసెంటర్): జిల్లాలో విద్యుత్ బిల్లులు డిజిటల్ పద్ధతిలో చెల్లించేందుకు వినియోగదారులు ప్రాధాన్యం ఇవ్వాలని ఏపీఎస్పీడీసీఎల్ జిల్లా సర్కిల్ ఏస్ఈ సుధాకర్ అన్నారు. నగరంలోని విద్యుత్ భవన్లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎండీ శివశంకర్ ఆదేశాల మేరకు విద్యుత్ రెవెన్యూ సిబ్బంది, అధికారులు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారని వెల్లడించారు. వినియోగదారులు ఏపీఎస్పీడీసీఎల్ యాప్, వెబ్సైట్, యూపీఐ, క్యూఆర్ కోడ్ల ద్వారా సులభంగా ఇంటి నుంచే బిల్లులు చెల్లించాలని కోరారు. బిల్లులు వచ్చిన రోజు నుంచి 14 రోజుల్లోపు చెల్లించాల్సి ఉంటుందన్నారు. లేనిపక్షంలో ఆలస్య రుసుము విధిస్తారన్నారు. నెలరోజులు దాటితే జరిమానాతోపాటు, రూ.100 ఆర్సీ రుసుం కూడా కట్టాల్సి ఉంటుందన్నారు.


