మానవతామూర్తులు మైరెన్‌ పోలీసులు | - | Sakshi
Sakshi News home page

మానవతామూర్తులు మైరెన్‌ పోలీసులు

Nov 10 2026 12:19 AM | Updated on Nov 10 2026 12:19 AM

● ఒకటిన్నర కి.మీ. మృతదేహాలను మోసి అప్పగింత

కావలి: ఇస్కపల్లి కోస్టల్‌ సెక్యూరిటీ పోలీసులు మానవతామూర్తులుగా నిలిచారు. ఇటీవల బంగాళాఖాతంలో కల్లోలం సృష్టించిన మురస తుపాను బీభత్సంలో చైన్నెకు చెందిన మత్స్యకారుల బోటు కడలిలో గల్లతై కొందరు మృతి చెందిన విషయం తెలిసిందే. అందులో కొన్ని ప్రకాశం జిల్లా తీరానికి కొట్టుకురాగా, రెండు సోమవారం బోగోలు మండలం జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ సమీపంలోని లక్ష్మీపురం షిప్‌ల్యాండ్‌ సెంటర్‌కు కొట్టుకొచ్చాయి. సమాచారం అందుకున్న కోస్టల్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ప్యాక్‌ చేసి సుమారు ఒకటిన్నర కి.మీ. రహదారి మార్గం వద్దకు మోసుకొని తీసుకొచ్చారు. బంధువులకు అప్పగించి రవాణాకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. మృతుల బంధువులు సైతం చేరుకోలేని సందర్భంలో వేగంగా స్పందించి రిస్క్‌ తీసుకొని మానవత్వాన్ని చాటుకున్నారు. మైరెన్‌ సీఐ ఫిరోజ్‌, హోంగార్డు శ్యామ్యూల్‌, బాలు చూపిన చొరవను స్థానిక మత్స్యకారులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement