ప్రజాభిప్రాయం.. లెక్కింపులో తారుమారు | - | Sakshi
Sakshi News home page

ప్రజాభిప్రాయం.. లెక్కింపులో తారుమారు

Nov 10 2026 12:19 AM | Updated on Nov 10 2026 12:19 AM

● తీర్పు మార్చేసి ప్రజాస్వామ్యం అపహాస్యం

● మేకపాటి రాజగోపాల్‌రెడ్డి

ఉదయగిరి: పరిషత్‌ ఎన్నికల్లో ఉదయగిరి నియోజకవర్గ ఓటర్లు తమ పక్షాన నిలిచి తమ అభ్యర్థులకు ఓట్లేస్తే.. ఫలితాలను అధికారులు తారుమారు చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉదయగిరి సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఈ మేరకు విలేకరులతో సోమవారం ఆయన మాట్లాడారు. సీతారామపురం, ఉదయగిరి మండలాల్లో అభ్యర్థుల ప్రమేయం లేకుండానే నామినేషన్లను విత్‌డ్రా చేశారని ఆరోపించారు. దుత్తలూరు, వరికుంటపాడు మండలాల్లో నామినేషన్లు చెల్లుబాటు కాలేదని ప్రకటించారని దుయ్యబట్టారు. ఎన్నికల్లో అనేక ప్రాంతాల్లో రిగ్గింగ్‌ చేశారని.. కౌంటింగ్‌ సమయంలో ఓట్లను తారుమారు చేశారని చెప్పారు. జలదంకి బిట్‌ – 2లో తమ అభ్యర్థి గెలిచినా... రీకౌంటింగ్‌ జరిపి టీడీపీ విజయం సాధించిందని ఆర్వో ప్రకటించారని మండిపడ్డారు. కౌంటింగ్‌ కేంద్రంలోకి ఎమ్మెల్యే వెళ్లి అధికారులను ప్రభావితం చేసి ఫలితాలను మార్చారని విమర్శించారు. అక్రమాలకు పాల్పడిన వారిని ఉపేక్షించేదిలేదని, తమ పార్టీ అధికారంలోకి వచ్చాక వీరిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిఽధి గూడపు వీరశేఖర్‌, శేషారెడ్డి, నేతలు యర్ర బ్రహ్మయ్య, చింతంరెడ్డి లోకేశ్‌, రమణారెడ్డి, ఆదిశేషారెడ్డి, మదన్‌, తిరుపతినాయుడు, అలీ అహ్మద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement