● అనంతసాగరం ఏఆర్వో వీరవసంతరావు.. పలు అవినీతి ఆరోపణలతో గతంలో సస్పెండ య్యారు. అధికార పార్టీ నేతల ఆశీస్సులతో ఈ మండలంలో తహసీల్దార్ పోస్టింగ్‌కు తెచ్చుకున్నారు. పరిషత్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో టీడీపీపై తన స్వామిభక్తిని ప్రదర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పడమటికంభంపాడు ఎంపీటీసీ అభ్యర్థి వెంకటకృష్ణారెడ్డి తొలుత 44 ఓట్లతో విజయం సాధించారని బోర్డు ద్వారా ప్రకటించారు. అయితే దాన్ని కాదంటూ టీడీపీ అభ్యర్థన మేరకు రీకౌంటింగ్‌ను చేపట్టారు. చివరికి పలు ఓట్లు చెల్లనివిగా పేర్కొంటూ టీడీపీ అభ్యర్థి విజయం సాధించారని ప్రకటించారు. పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి అమరావతి గెలుపొందగా, ఈయన అడ్డుపడి కౌంటింగ్‌ను సుమారు గంటకుపైగా నిలిపేశారు. అనంతరం ప్రారంభించి 979 ఓట్లు చెల్లనివిగా ప్రకటించి, చివరకు టీడీపీ అభ్యర్థి విజయం సాధించారని తెలిపారు. దీనికి నిరసనగా అమరావతితో పాటు పార్టీ నేతలు నిరసన వ్యక్తం చేసినా, వీరిని పోలీసులు పంపేశారు.


