ఫలితాల తారుమారుకు సహకారం | - | Sakshi
Sakshi News home page

ఫలితాల తారుమారుకు సహకారం

Nov 10 2026 12:19 AM | Updated on Nov 10 2026 12:19 AM

● పొదలకూరు ఆర్వో విజయకుమార్‌రెడ్డి.. పరిషత్‌ ఎన్నికల కౌంటింగ్‌లో పారదర్శకతను పాటించలేదు. ఫలితంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి బచ్చల సురేష్‌కుమార్‌రెడ్డి కేవలం 46 ఓట్లతో ఓడిపోయారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రకటించారు. ప్రతి రౌండ్‌ ఫలితాలను ప్రకటించకపోవడం, 22వ రౌండ్‌ నుంచే వెల్లడించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఒత్తిళ్లకు తలొగ్గి.. విజయం తారుమారయ్యేందుకు సహకరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి రౌండ్‌ మెజార్టీలను బోర్డుపై రాయకపోవడంపై తమకు అనుమానంగా ఉందని పార్టీ ప్రకటించింది. ఏజెంట్ల సంతకాలు సైతం ఈయన తీసుకోకపోవడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement