టీడీపీకి దాసోహం | - | Sakshi
Sakshi News home page

టీడీపీకి దాసోహం

Nov 10 2026 12:19 AM | Updated on Nov 10 2026 12:19 AM

● చేజర్ల ఆర్వోగా వ్యవహరించిన బొడ్డు ప్రసాద్‌బాబు.. పరిషత్‌ ఎన్నికల స్క్రూట్నీ, నామినేషన్ల ఉపసంహరణ.. ఇలా ప్రతి అంశంలోనూ టీడీపీకి దాసోహమయ్యారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాల్సి ఉన్నా, పట్టించుకోలేదు. నామినేషన్‌ పత్రాలతో జత చేసిన కొన్ని ఫారాలను చించేసి తాను అధికారిని కానని.. అధికార పార్టీ ఏజెంట్‌ననే రీతిలో వ్యవహరించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు తమ నామినేషన్‌ పత్రాలకు జతచేసిన కొన్నింటిని తొలగించి.. అసలు ఇవ్వలేదంటూ మెలిక పెట్టారు. పైగా తానెందుకు అబద్ధాలు చెప్తానంటూ అభ్యర్థులతో వ్యంగ్యంగా మాట్లాడారు. టీడీపీ స్థానిక నేతలిచ్చిన స్క్రిఫ్ట్‌నే అమలు చేశారు. కౌంటింగ్‌ సమయంలోనూ ఓట్లను తారుమారు చేశారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement