● ముత్తుకూరు ఆర్వో రమేష్‌బాబు.. నా మినేషన్ల స్వీకరణ మొదలుకొని అధికార పార్టీకి తొత్తులా మారారు. జెడ్పీటీసీ ఎన్నికల లెక్కింపు సందర్భంగా ఒత్తిళ్లకు తలొగ్గారు. దాదాపు 500 ఓట్లతో విజయం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నెల్లూరు పరిమళ 57 ఓట్ల తేడాతో ఓడిపోయినట్లు ప్రకటించారనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. న్యాయస్థానాన్ని ఆశ్రయించి, రీ కౌంటింగ్‌కు అభ్యర్థించనున్నారు. పార్టీ పైనాపురం ఎంపీటీసీ అభ్యర్థి పట్టపు ప్రశాంతి ఓటమిలోనూ ఈయన పాత్రుంది. చివరికి టీడీపీ అభ్యర్థి దాసరి కుమారి ఒక్క ఓటుతో గెలుపొందినట్లు ప్రకటించారు. రీ కౌంటింగ్ చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోరినా, ఆర్వో పట్టించుకోలేదు.


