పవర్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో నెల్లూరీయుల సత్తా | - | Sakshi
Sakshi News home page

పవర్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో నెల్లూరీయుల సత్తా

Nov 8 2026 5:29 AM | Updated on Nov 8 2026 5:29 AM

నెల్లూరు (టౌన్‌): కేరళంలో నవంబర్‌ 1 నుంచి 4వ తేదీ వరకు జరిగిన సౌత్‌ జోన్‌ ఎక్యుప్డ్‌ క్లాసిక్‌ పవర్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో జిల్లా వాసులు జ్ఞానేశ్వర్‌రెడ్డి. టి.రష్మిలు పాల్గొని బంగారు, వెండి పతకాలు సాధించారు. ఉన్నం జ్ఞానేశ్వరరెడ్డి 120 కేజీలు ప్లస్‌ సీనియర్‌ విభాగంలో క్లాసిక్‌లో బంగారు పతకం, ఎక్యుప్డ్‌లో వెండి పతకాన్ని సాధించారు. టి.రష్మి 63 కేజీల సీనియర్‌ విభాగంలో ఎక్యుప్డ్‌ కాంపిటేషన్‌లో వెండి పతకాన్ని సాధించారు. ఇరువురు క్రీడాకారులు బెంగళూరులోని అమృత పవర్‌ లిఫ్టింగ్‌ క్లబ్‌లో కోచ్‌ శ్రీకాంత్‌ వద్ద శిక్షణ తీసుకుంటూ పతకాలను సాధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement