చిల్లకూరు: మండలంలోని పారిచెర్లవారిపాళేనికి చెందిన గర్భిణి కాన్పు కోసం శనివారం 108 వాహనంలో వెళ్తుండగా మార్గమధ్యలోనే ప్రసవించింది. పారిచెర్లవారిపాళెం గ్రామానికి చెందిన పూరేటి చందు, వసంత దంపతులకు మొదటి సంతానంగా మగ బిడ్డ ఉన్నాడు. వసంత రెండోసారి గర్భం దాల్చడం, నిండు గర్భణిగా నొప్పులు పడుతుండటంతో 108 వాహనంలో గూడూరు ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో ఆమెకు మార్గమధ్యలో నొప్పులు ఎక్కువ కావడంతో 108 ఈఎంటీ కృష్ణ కాన్పు చేశారు. ఆమె ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆమెను గూడూరులోని మాతా శిశుసంరక్షణ కేంద్రంలో చేర్చించారు.


