జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ | - | Sakshi
Sakshi News home page

జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌

Nov 7 2026 12:18 AM | Updated on Nov 7 2026 12:18 AM

నెల్లూరు(పొగతోట): ఎన్నికల నియమావళిని అనుసరించి ఓట్ల లెక్కింపు ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్రాధికారులు ఆదేశించారు. ఈ మేరకు జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ను విజయవాడ నుంచి శుక్రవారం నిర్వహించారు. జెడ్పీ సీఈఓ మధుసూదన్‌ తదితరులు హాజరయ్యారు.

తిక్కవరంలో రీపోలింగ్‌

నిర్వహణకు వినతి

● వైఎస్సార్సీపీ మర్రిపాడు జెడ్పీటీసీ

అభ్యర్థి వెంకటరమణమ్మ

● కలెక్టర్‌కు వినతిపత్రం అందజేత

నెల్లూరు రూరల్‌: మర్రిపాడు మండలంలోని తిక్కవరం పోలింగ్‌ కేంద్రంలో చోటుచేసుకున్న రిగ్గింగ్‌పై సమగ్ర విచారణను జరిపి.. అక్కడ రీపోలింగ్‌ను నిర్వహించాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి సిద్దంరెడ్డి వెంకటరమణమ్మ కోరారు. ఈ మేరకు కలెక్టర్‌ హిమాన్షు శుక్లాకు వినతిపత్రాన్ని శుక్రవారం అందజేసిన అనంతరం ఆమె మాట్లాడారు. కేంద్రంలో ఉన్న తమ పార్టీ ఏజెంట్లను ఎస్సై బలరామ్‌రెడ్డి బలవంతంగా బయటకు పంపి.. ఆపై రిగ్గింగ్‌కు టీడీపీ నేతలు పాల్పడ్డారని ఆరోపించారు. విషయం తెలుసుకొని పోలింగ్‌ కేంద్రానికి మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి బయల్దేరగా, మర్రిపాడు వద్ద ఆత్మకూరు సీఐ గంగాధర్‌ అడ్డుకొని సుమారు 30 నిమిషాల పాటు నిలువరించారని తెలిపారు. ఆయన చేరుకునేసరికే సుమారు 200 ఓట్లను రిగ్గింగ్‌ చేశారని చెప్పారు. తిక్కవరం పోలింగ్‌ కేంద్రానికి సంబంధించిన వెబ్‌కాస్టింగ్‌ దృశ్యాలు, సీసీ కెమెరాల ఫుటేజీ, రికార్డులను పరిశీలించాలని కోరారు. వీడియో ఆధారాల ను కలెక్టర్‌కు అందజేశారు. ఉదయగిరి నియోజకవర్గ పరిశీలకుడు కూనం సుధాకర్‌రెడ్డి, నేతలు సిద్ధంరెడ్డి మోహన్‌రెడ్డి, అంబటి కృష్ణారెడ్డి, రవి తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్సీపీ నేతలపై

అక్రమ కేసులు

ఉదయగిరి: పరిషత్‌పోరులో భాగంగా మండలంలోని బిజ్జంపల్లి బూత్‌ను టీడీపీ నేతలు గురువారం ఆక్రమించి రిగ్గించే చేసే యత్నాలను అడ్డుకున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలపై అక్రమ కేసులను పోలీసులు నమోదు చేశారు. అదే గ్రామానికి చెందిన లక్కు రమణారెడ్డి ఫిర్యాదు మేరకు 12 మంది నేతలపై కేసు నమోదు చేశామని సీఐ అంకమరావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement