● ఆత్మకూరు సీఐ గంగాధర్, మర్రిపాడు ఎస్సై బలరామిరెడ్డి, చేజర్ల ఎ.అయ్యప్ప ఎస్సై పూర్తిస్థాయిలో పచ్చ చొక్కాలు తొడిగేశారు. పరిషత్ ఎన్నికలు జరిగే బూత్‌ల్లో యథేచ్ఛగా రిగ్గింగ్‌లు జరిగేలా ప్రోత్సహించారు. వీరిద్దరూ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి అధికార పార్టీ తొత్తులుగా మారారు. మర్రిపాడు మండలంలోని తిక్కవరంలో వైఎస్సార్సీపీ ఏజెంట్లుగా ఉన్న రవీంద్రబాబు, నారాయణస్వామి, విజయ్‌కుమార్‌లను ఎస్సై బలరామిరెడ్డి మీపై బైండోవర్ కేసు ఉందంటూ ఆ ముగ్గురిని బలవంతంగా బయటకు పంపించారు. టీడీపీ నేతలు అరగంట పాటు 200 ఓట్లు రిగ్గింగ్ చేసుకున్నారు. అడ్డుకునేందుకు ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే విక్రమ్‌రెడ్డి తిక్కవరం వెళ్తుండగా ఆత్మకూరు సీఐ గంగాధర్ తన వాహనాన్ని అడ్డు పెట్టి అక్కడికి వెళ్లడానికి వీల్లేదంటూ అడ్డుకున్నాడు. రిగ్గింగ్ పూర్తయ్యాకే మాజీ ఎమ్మెల్యే వాహనం వెళ్లేందుకు అనుమతించారు.


