వెలుగుల పండగలో అప్రమత్తతే రక్షణ | - | Sakshi
Sakshi News home page

వెలుగుల పండగలో అప్రమత్తతే రక్షణ

Nov 7 2026 12:12 AM | Updated on Nov 7 2026 12:12 AM

● చిన్నపాటి నిర్లక్ష్యం పెనుప్రమాదానికి కారణం

● కాలుష్యానికి తావులేకుండా

హరిత దీపావళికి ప్రాధాన్యం

నెల్లూరు(క్రైమ్‌): దీపావళి వచ్చిందంటే ఎక్కడలేని ఆనందం. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా టపాసులు కాల్చేందుకు అందరూ ఉత్సాహం చూపుతారు. ఇంటిల్లిపాది మతాబులు, కాకరొత్తులు, చిచ్చుబుడ్లు కాలుస్తూ సంతోషంగా గడుపుతారు. ఇంటి ఆవరణలో రంగురంగుల వెలుగులు, టపాసుల మోతతో పండగ వాతావరణం నెలకొంటుంది. అయితే ఈ వెలుగుల వెనుక ప్రమాదాలు కూడా పొంచి ఉంటాయి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఆనందం కాస్తా విషాదంగా మారే ప్రమాదం ఉంది. వెలుగు జిలుగుల పండగ చీకట్లను మిగల్చకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వ్యవహరించాలి. ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే ప్రతమ చికిత్స అందించి వైద్యసహాయం పొందాలి.

వాటికి దూరంగా..

మరోవైపు భారీ శబ్దాలు, దట్టమైన పొగ వెలువరించే బాణసంచాకు దూరంగా ఉంటూ పర్యావరణహితంగా దీపావళిని జరుపుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. టపాసుల నుంచి వెలువడే పొగ, విష వాయువులు గాలి నాణ్యతను దెబ్బతీయడమే కాకుండా చిన్నారులు, వృద్ధులు, శ్వాసకోస సమస్యలతో బాధపడే వారికి ఇబ్బందులు కలిగిస్తాయని పేర్కొంటున్నారు. అధిక శబ్దాలు పక్షులు, జంతువులతోపాటు ఇతర జీవరాశులకు కూడా తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తాయని పేర్కొంటున్నారు. టపాసులు వినియోగాన్ని తగ్గించి ప్రమిదలు, దీపాళతో ఇళ్లను అలంకరించడం ద్వారా పర్యవరణానికి మేలు చేయొచ్చని చెబుతున్నారు. తప్పనసరిగా బాణసంచాలు కాల్చాలనుకునే వారు తక్కువ శబ్దం, కాలుష్యం వెలువరించే హరిత టపాసులకే ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు.

జాగ్రత్తలు తప్పనిసరి

అనుమతి పొందిన దుకాణాల్లోనే బాణసంచా కొనుగోలు చేయాలి. తల్లిదండ్రుల సమక్షంలోనే పిల్లలు టపాకాయలు కాల్చాలి. కాల్చే సమయంలో దగ్గరలో నీటిని, ఇసుకను అందుబాటులో ఉంచుకోవాలి. కాల్చే సమయంలో వదులుగా ఉండే కాటన్‌ దుస్తులు ధరించాలి. పొరపాటున దుస్తులకు నిప్పు అంటుకుంటే పరిగెత్తకుండా నేలపై పడుకుని అటు ఇటు పొర్లుతుండాలి. బాణసంచా కాల్చే సమయంలో వెలువడే విషవాయువులను పీల్చకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రాకెట్లను నిటుగారుగా ఉండే విధంగా అమర్చి జనవాసాలకు, చెట్లకు దూరంగా కాల్చాలి. టపాసులు కాల్చిన తర్వాత మిగిలిన వ్యర్థాలను చేతులతో పట్టుకోకుండా తొలగించాలి.

బాణసంచా కాల్చే సమయంలో ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినప్పుడు ఈ ఫోన్‌ నంబర్లకు సమాచారం ఇవ్వాలని అగ్నిమాపక శాఖ అధికారులు కోరుతున్నారు. 101తోపాటుగా కింద సూచించిన నంబర్లకు సమాచారం ఇవ్వొచ్చు.

ఫైర్‌ స్టేషన్‌ మొబైల్‌ నంబర్‌

నెల్లూరు 99637 34284

కావలి 99637 34286

ఉదయగిరి 99637 35314

వింజమూరు 99637 35446

మర్రిపాడు 99637 44817

ఆత్మకూరు 99637 34394

పొదలకూరు 99637 34828

రాపూరు 99637 35094

గూడూరు 99637 34305

కోట 99637 35036

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement